Homeఅంతర్జాతీయంఅమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ దుర్మరణం

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ దుర్మరణం

క్రైమ్ మిర్రర్ : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. న్యూజెర్సీలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) మృతి చెందారు. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. దీపారెడ్డి తన భర్త రామకృష్ణారెడ్డితో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.

న్యూజెర్సీలోని ఓ సిగ్నల్ వద్ద దీపారెడ్డి ప్రయాణిస్తున్న కారు ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీపారెడ్డి మృతి వార్త స్వగ్రామమైన ఆకుతోటపల్లిలో విషాదాన్ని నింపింది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ స్వగ్రామంతో అనుబంధం కొనసాగించిన దీపారెడ్డి మృతితో గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
also read : ఫిర్యాదు కోసం వచ్చిన యువతిని గర్భవతిని చేసిన ఇన్ స్పెక్టర్.. డీజీపీని ఆశ్రయించిన బాధితురాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు