HomeసినిమాPriyanka Chopra: అబ్బాయిలు వర్జిన్ అమ్మాయి కోసం చూడకండి

Priyanka Chopra: అబ్బాయిలు వర్జిన్ అమ్మాయి కోసం చూడకండి

Priyanka Chopra: ప్రస్తుతం సినీ రంగంలో హీరోయిన్లు తమ కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలు, కష్టాలు, ఎదురుదెబ్బలను ధైర్యంగా బయటపెడుతూ యువ నటీనటులకు విలువైన సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పాన్ ఇండియా హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా అబ్బాయిలు వర్జిన్ అమ్మాయిల కోసం వెతకకూడదని, అలాంటి ఆలోచనలను వదిలేయాలని ఆమె చేసినట్లు ప్రచారం జరుగుతూ వివాదానికి కారణమైంది.

ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఈ గ్లోబల్ హీరోయిన్, ఒక్కో సినిమాకు సుమారు రూ.30 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటూ స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. బాలీవుడ్‌లో అనేక సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె, ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. అంతేకాకుండా ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ ప్రాజెక్టులో కూడా ఆమె నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యాయి. అందులో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం అబ్బాయిలు కన్యత్వాన్ని ఆధారంగా చేసుకుని అమ్మాయిలను ఎంపిక చేయకూడదని, మంచి నడవడిక, వ్యక్తిత్వం ఉన్న వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని చెప్పినట్లు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. కన్యత్వం ఒక క్షణంలో సంబంధించిన అంశం మాత్రమేనని, కానీ వ్యక్తిత్వం, విలువలు జీవితాంతం నిలుస్తాయని ఆమె అన్నట్లు ప్రచారం జరిగింది.

అయితే ఈ వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతున్న సమయంలోనే, ఆ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా స్వయంగా స్పందించారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విషయాన్ని నిజమని నమ్మకూడదని ఆమె స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన పేరుతో వైరల్ అవుతున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని ఆమె పేర్కొన్నారు. నకిలీ కంటెంట్‌ను సృష్టించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా సులభమైందని, అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అలాగే ఆన్‌లైన్‌లో కనిపించే లింకులు, స్క్రీన్ షాట్లు లేదా ఇతర ఆధారాలు అన్నీ నిజమైనవి కావని, వాటిని నమ్మే ముందు ఒకసారి ధృవీకరించుకోవాలని ఆమె కోరారు. స్క్రోల్ చేస్తూ చూసే ప్రతి విషయాన్ని నిజమని భావించకూడదని, సోషల్ మీడియాలో సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యమని కూడా ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వివరణాత్మక స్పందన కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

ALSO READ: గర్భిణీకి వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరించినందుకు కంపెనీకి వందల కోట్ల జరిమానా!

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు