Homeతెలంగాణరేషన్ కార్డుల వేదికగా పొలిటికల్ హీట్...! బీజేపీపై మంత్రి ఉత్తమ్ ఫైర్...

రేషన్ కార్డుల వేదికగా పొలిటికల్ హీట్…! బీజేపీపై మంత్రి ఉత్తమ్ ఫైర్…

  • నేరేడుచర్లలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

  • బీజేపీపై ‘ఓటు చోరీ’ ఆరోపణలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • బీఆర్‌ఎస్‌ పాలనలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రశ్నలు

  • సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వ విధానాన్ని వివరించిన మంత్రి

 

సూర్యాపేట , క్రైమ్‌మిర్ర‌ర్‌: పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల కార్యక్రమం రాజకీయ వ్యాఖ్యలకు వేదికగా మారింది. నేరేడుచర్లలో కార్డుల పంపిణీ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ, బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. బీజేపీ ప్రజలను మోసం చేసిందని, ఓటు చోరీకి పాల్పడిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశం ఎదురుచూస్తోందని, భవిష్యత్తులో ఆయన ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. నేరేడుచర్ల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సన్నబియ్యంపై మంత్రి ఏమన్నారు…?

పేద కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో సరఫరా చేసిన దొడ్డు బియ్యంపై ఆయన విమర్శలు చేశారు. ఆ బియ్యాన్ని చాలామంది వినియోగించకుండా విక్రయించేవారని వ్యాఖ్యానించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ తెలంగాణలో అమలు చేస్తున్న విధంగా సన్నబియ్యం పంపిణీ జరగడం లేదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 90 శాతం మంది పేదలు సన్నబియ్యం తింటున్నారని ఆయన చెప్పారు.

బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రశ్నలు…

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కొత్త కార్డులను అందిస్తున్నట్లు వివరించారు. సూర్యాపేట జిల్లాలో మూడు లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలో సుమారు పది లక్షల మంది సన్నబియ్యం పొందుతున్నారని చెప్పారు. అదే విధఃగా తన నియోజకవర్గ పరిధిలో లక్షకు పైగా కొత్త రేషన్ కార్డులు అందించామని పేర్కొన్నారు. వీటి ద్వారా సుమారు మూడు లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఇదే సందర్భంగా కేంద్రంలోని బీజేపీపై రాజకీయ విమర్శలు చేసిన మంత్రి.. రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ అంశాలను ప్రస్తావించారు. కార్యక్రమం రాజకీయ విమర్శలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రస్తావనతో సాగింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. టాలీవుడ్‌లో హీరోల రూపురేఖలు మార్చిన డాషింగ్ డైరెక్టర్… HBD పూరి జగన్నాథ్
  2. తహసీల్దార్‌పై వరుస ఆరోపణలు..!
  3. ఏపీ ఓటర్ల విచారణ దాదాపు పూర్తి: 42 లక్షల మందికి అర్హత, అక్టోబర్ 9న తుది జాబితా!
  4. కుమార్తె జ్ఞాపకార్థం తండ్రి అపురూప కానుక.. రూ.2 లక్షలతో గుడి నిర్మాణం

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు