Homeక్రైమ్పోలీసు వాహ‌నాన్ని ఇసుక ట్రాక్ట‌ర్ ఢీ...డ్రైవ‌ర్ ప‌రార్‌

పోలీసు వాహ‌నాన్ని ఇసుక ట్రాక్ట‌ర్ ఢీ…డ్రైవ‌ర్ ప‌రార్‌

తాండూరు, క్రైమ్ మిర్ర‌ర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు వాహ‌నాన్ని ఇసుక ట్రాక్ట‌ర్ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో పోలీసు వాహ‌నం తీవ్రంగా దెబ్బ‌తింది. వివ‌రాల ప్ర‌కారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీశైలం యాదవ్ మంగళవారం ఉదయం తెల్లవారుజామున మండల లోని దామర్చాడ్ గ్రామ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో అటు వ‌స్తున్న ఇస‌క ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ వేగంగా న‌డుపుతూ ఒక్క‌సారిగా పోలీసు వాహనాన్ని ఢీకొట్టి గ‌నుల వైపు ప‌రార‌య్యాడు. పోలీసులు ట్రాక్ట‌ర్‌ను వెంబ‌డించిన దొర‌క‌లేదు. ఇసుక ట్రాక్ట‌ర్ ఎవ‌రిద‌నేదానిపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ట్రాక్ట‌ర్ గ‌నుల వైపు వెళ్ల‌డ‌తో ఇంత వ‌ర‌కు ఆచూకి ల‌భించ‌లేద‌ని తెలిపారు.

తాజావార్తలు