సముద్ర తీరాలు అంటే ఆనందం, ఉల్లాసం, మధుర జ్ఞాపకాలు. అలల మధ్య గడిపే ప్రతి క్షణాన్ని ఫొటోలుగా నిలుపుకోవాలని ప్రతి పర్యాటకుడూ ఆశపడతాడు. అయితే, జాగ్రత్తలు పాటించకపోతే అదే సరదా ప్రాణాంతకంగా మారుతుందని గోవాలో జరిగిన ఓ ఘటన మళ్లీ స్పష్టం చేసింది.
కర్ణాటకకు చెందిన 33 ఏళ్ల అష్పక్ మసాలీ గోవా పర్యటనకు వెళ్లాడు. ప్రసిద్ధ బాగా బీచ్‌లో అలల మధ్య ఫొటోలు దిగాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం సముద్ర తీరంలోని ఒక బండరాయిపై కూర్చుని పోజులు ఇస్తుండగా, అతని స్నేహితుడు దూరం నుంచి ఫొటోలు తీస్తున్నాడు.
అయితే ఆ సమయంలో సముద్రంలో అలల ఉధృతి క్రమంగా పెరిగింది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నా, అష్పక్ అక్కడి నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఒక్కసారిగా ఎగిసిపడిన భారీ అల అతడిని బలంగా ఢీకొట్టింది. కాలు జారి నియంత్రణ కోల్పోయిన అతను నీటిలో పడిపోయాడు. అలల వేగం ముందు అతను బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్షణాల్లోనే సముద్రం అతడిని లోపలికి లాగేసింది. అక్కడే ఉన్న వ్యక్తి ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించగా, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ కలచివేస్తోంది.
Goa – A 33-year-old tourist from Bijapur in Karnataka lost his life after drowning in the sea at Baga Beach, the tourist was sitting on a rock near the shoreline when a powerful wave, triggered by the ongoing monsoon, suddenly swept him into the sea. Despite struggling in the… pic.twitter.com/IMoR8x8up9
— NextMinute News (@nextminutenews7) June 25, 2026