Homeతెలంగాణదివ్యాంగుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వం లక్ష్యం - నకిరేకల్ ఎమ్మెల్యే

దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వం లక్ష్యం – నకిరేకల్ ఎమ్మెల్యే

క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం మరియు ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం లో మాట్లాడుతన్న ఎమ్మెల్యే వీరేశం
అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం లో మాట్లాడుతన్న ఎమ్మెల్యే వీరేశం

నల్గొండ జిల్లా, నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ముఖ్య అతినిధిగా హాజరై, ప్రభుత్వ పథకాల ద్వారా మంజూరైన స్కూటీలు మరియు ల్యాప్‌టాప్‌లను అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు ఎమ్మెల్యే మంగళవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ… దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం మరియు ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు