క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తమ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత దూకుడుగా స్పందించారు. సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తూనే, ఆయనకు సరికొత్త కౌంటర్ సవాల్‌ను విసిరారు.ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.”రైతుల సమస్యల మీదైనా, నిరుద్యోగుల అంశాల మీదైనా.. దేనిమీదైనా సరే చర్చించడానికి నేను సిద్ధం. ఈ చర్చకు నువ్వు వస్తావా? లేదా మీ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తాడా? చర్చించే అంశం నీ ఇష్టం.. చర్చ జరిగే వేదిక కూడా నీ ఇష్టమే” అని కేటీఆర్ సవాల్ విసిరారు.
పశ్చిమ బెంగాల్ వ్యూహాలు తెలంగాణలో పని చేయవు….! సీఎం రేవంత్ రెడ్డి…
నిరూపించకపోతే రాజకీయ సన్యాసం!
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఖచ్చితమైన లెక్కలతో సహా నిరూపిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. “ప్రభుత్వ అధికారిక గణాంకాలతో మీ తప్పులను వేలెత్తి చూపించకపోతే.. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా” అంటూ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని మండిపడ్డారు. కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి తమపై ఏడుస్తూ, నిందారోపణలు చేస్తున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
రూ.315 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం!