క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు శుభవార్త తెలిపింది. ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న వెనుకబడిన తరగతుల (BC) విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.315.13 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ‘జీవో 94’ను జారీ చేసింది.2024-25, 2025-26 విద్యాసంవత్సరాలకు సంబంధించి విద్యార్థుల ట్యూషన్ ఫీజులు చెల్లించేందుకు ఈ నిధులను ఇస్తున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.దీనికి తోడు, డీమ్డ్ వర్సిటీల్లో (Deemed Universities) చదువుతున్న ఎస్సీ (SC), ఎస్టీ (ST) విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అందించేందుకు ప్రభుత్వం మరో ప్రత్యేక జీవోను సైతం జారీ చేయడం గమనార్హం.
ఆగ్రహంతో రగిలిపోతున్న కోమటిరెడ్డి!
పశ్చిమ బెంగాల్ వ్యూహాలు తెలంగాణలో పని చేయవు….! సీఎం రేవంత్ రెడ్డి…