Friday, March 6, 2026
Homeఅంతర్జాతీయంఇరాన్ నేతగా ఖమేనీ కుమారుడు ముజ్తబా....?

ఇరాన్ నేతగా ఖమేనీ కుమారుడు ముజ్తబా….?

  • అధికార మార్పిడి జరిగిందని ప్రచారం

టెహ్రాన్,క్రైమ్ మిర్ర‌ర్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఎవరు పగ్గాలు అందుకుంటారన్న చర్చలో ఖమేనీ కుమారుడే ముందువరసలో ఉన్నట్లు సమాచరం. ఇప్ప్పుడా పాలనా పగ్గాలను ఖమేనీ కుమారుడు ముజ్తబా హళస్సేనీ ఖమేనీకి అప్పగించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించిన అనుభవమేదీ లేని ముజ్తబా త్వరలోనే సుప్రీంలీడర్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

ఆయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడే ముజ్తబా. 1969లో ఇరాన్‌లోని మషాద్‌లో జన్మించారు. ముజ్తబా పదేళ్ల వయసులోనే ఇరాన్ రాజు మహమ్మద్ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా 1979లో ఇస్లామిక్ విప్లవం జరిగింది. ఆ సమయంలో ఖమేనీ కుటుంబం రాజకీయంగా ఎదిగింది. ఆ తర్వాత వీరి కుటుంబం టెహ్రాన్‌లో స్థిరపడింది. కోమ్‌లోని సెమినరీస్‌లో మత విద్యను అభ్యసించిన ముజ్తబా `కెరికల్ ర్యాంక్‌కు చేరుకున్నారు.

కానీ, అత్యున్నత ర్యాంక్ అయిన ఆయతుల్లాను అందుకోలేకపోయారు. అయినా సుప్రీంలీడర్ కార్యాలయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారారు.1980ల్లో జరిగిన ఇరాన్`ఇరాక్ యుద్ధంలో ముజ్తబా పాల్గొన్నాడు. ఆ అనుభవమే ఇరాన్ సైన్యానికి ఆయనను దగ్గర చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)తో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ముజ్తబాకు సుప్రీం పదవి దక్కడానికి ఇదీ ఓ కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. సాధారణంగా సుప్రీంలీడర్ నియామకాన్ని చేపట్టేందుకు 88 మంది షియా మత పెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్) ఉంటుంది.

ఇందులో సభ్యులను ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్దాంతాలకు విరుద్ధమని ఈ కమిటీ భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముజ్తబా నియామకానికి ఈ కమిటీలోని కొందరు సుముఖంగా లేరని, కానీ ఐఆర్‌జీసీ ఒత్తిడితోనే ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ముజ్తబా ఇప్పటివరకు ఇరాన్‌లో అధికారిక పదవులేవీ చేపట్టలేదు. బహిరంగ ప్రసంగాల్లోనూ అరుదుగా కన్పించేవారు.

అయినా రాజకీయ నియామకాలు, పాలనాపరమైన నిర్ణయాల్లో తెర వెనుక కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ముజ్తబా ఖమేనీపై 2019లో అమెరికా ఆంక్షలు విధించింది. అయినా ఆయన ప్రపంచవ్యాప్తంగా సంపన్న సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేయడమే గాక.. పశ్చిమ మార్కెట్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. ముజ్తబా నికర సంపద ఎంతనే దానిపై స్పష్టత లేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయట. స్విస్ బ్యాంకు ఖాతాల్లో పెద్దఎత్తున డిపాజిట్లతో పాటు.

బ్రిటన్‌లో 138 మిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీ ఆయన పేరు విÖద ఉన్నట్లు సమాచారం. ఇరాన్ సంప్రదాయ వాద రాజకీయ నాయకుడు ఘోలమ్ అలీ కుమార్తె జహ్రాను ముజ్తబా 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. వీరి కుటుంబం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే, ఇటీవల ఇజ్రాయెల్`అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ముజ్తబా భార్య మతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేదు. ఈ దాడుల్లో ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మరణించినట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments