Homeతెలంగాణతెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం...! వేస‌వి నాటికి మెట్రో అద‌న‌పు కోచ్‌లు...

తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…! వేస‌వి నాటికి మెట్రో అద‌న‌పు కోచ్‌లు…

క్రైమ్ మిర్రర్ హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో రద్దీ వేళల్లో మెట్రో రైళ్లలో ఎదురవుతున్న తీవ్ర జాప్యం, ప్రయాణికుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఐటీ కారిడార్ సహా అన్ని మార్గాల్లో మెట్రో రైళ్లకు ప్రాధాన్యత పెరగడం.. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో.. మెట్రో రైళ్ల సీటింగ్ సామర్ధ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నడుస్తున్న మూడు కోచ్ ల స్థానంలో.. అదనపు కోచ్ లను జోడించడం లేదా అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రద్దీని నియంత్రించాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్.

సమయం పట్టే అవకాశం…

Also Read:సంచ‌ల‌న నిర్ణ‌యం…! పెళ్లికాని యువ‌త మ‌ద్యం తాగితే రూ.5వేలు జ‌రిమాన…

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది కానీ.. ఇది క్షేత్రస్థాయిలో సాధ్యమేనా అనే టాక్ వినిపిస్తోంది. మెట్రో రైల్ అధికార వర్గాల ప్రకారం.. ఈ నూతన కోచ్ ల కొరుగోలు, తయారీ ప్రక్రియకు కాస్త సమయం పట్టనుంది. మెట్రో కోచ్ లు సాధారణ రైలు డబ్బాల మాదిరిగా రెడీమేడ్ గా లభించవు. హైదరాబాద్ మెట్రో ట్రాక్ సిస్టమ్స్, డిజైన్, సిగ్నలింగ్ సాంకేతికతను అనుగుణంగా ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆర్డర్ ఇచ్చి తయారీ పూర్తయి ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 6 నుంచి ఎనిమిది నెలల సమయం పట్టి అవకాశం ఉంది. అంటే వచ్చే వేసవి నాటికి సిద్ధమవుతాయి అన్నమాట. అది కూడా యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభిస్తేనే.

ఆ మార్గాల్లో రద్దీ…

Also Read:పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే.. ఆటలే మంత్రం!

జంట నగరాల్లో మెట్రో రైల్లో విపరీతమైన రద్దీ పెరుగుతోంది. ప్రధానంగా మియాపూర్- ఎల్బీనగర్.. నాగోల్- రాయదుర్గం కారిడార్లలో ఉదయం తో పాటు సాయంత్రం వేళల్లో తీవ్ర రద్దీ నెలకొంటోంది. వేలాది మంది ఐటి ఉద్యోగులు, రోజువారి ప్రయాణికులు కోచ్ లలో స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా రాబోయే కోచ్ లలో ప్రయాణ సామర్థ్యం గణనీయంగా పెరగడమే కాకుండా.. రైళ్ల ఫ్రీక్వెన్సీ ని మరింత తగ్గించడానికి వీలవుతుందని మెట్రో అధికారులు అభిప్రాయపడుతున్నారు.

తయారీ సంస్థతో చర్చలు…

Also Read:గాలేలో అగ్నిపరీక్ష: వాతావరణం, కూకాబుర్ర బంతే భారత్‌కు అసలు సవాల్!

రాష్ట్ర ప్రభుత్వపరంగా ఈ అదనపు కోచ్ల ఏర్పాటుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభం అయింది. ప్రభుత్వం నుంచి అవసరమైన నిధుల కేటాయింపు, తయారీ సంస్థలతో చర్చలు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. కోచ్ల సంఖ్య పెరిగితే ప్రయాణం మరింత వేగవంతం కావడమే కాకుండా సౌకర్యవంతంగా మారుతుందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. వచ్చే ఆరు నుంచి 8 నెలల కాలంలో కొత్త కోచ్ లు పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు