Homeతెలంగాణబ్యాంక్ ఉద్యోగుల కష్టాలు తీరేదెన్నడు?.. తక్షణమే '5 డేస్ వర్కింగ్' అమలు చేయాలని కవిత డిమాండ్

బ్యాంక్ ఉద్యోగుల కష్టాలు తీరేదెన్నడు?.. తక్షణమే ‘5 డేస్ వర్కింగ్’ అమలు చేయాలని కవిత డిమాండ్

బ్యాంక్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న తీవ్రమైన పనిభారం, మానసిక ఒత్తిడిపై టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పందించారు. బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి వారానికి 5 రోజుల పని విధానాన్ని (5 డేస్ వర్కింగ్) తక్షణమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై కవిత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బ్యాంకర్ల కష్టాలను సుదీర్ఘంగా వివరించారు.

ఉదయం బ్యాంకులు తెరిచినప్పటి నుంచి ఉద్యోగులకు క్షణం తీరిక ఉండటం లేదని ఆమె పేర్కొన్నారు. నిరంతరం కస్టమర్లతో మాట్లాడటం, వారికి సేవలు అందించడంతోనే సమయం గడిచిపోతోందన్నారు. దీనికి తోడు బ్యాంకుకు సంబంధించిన ఎండ్ వర్క్ పూర్తి చేయడం, పై అధికారులు విధించే లక్ష్యాలను చేరుకోవడం, అలాగే చివరగా కరెన్సీ లెక్కలు చూసుకోవడం వంటి ముఖ్యమైన బాధ్యతలతో ఉద్యోగుల రోజంతా విధుల్లోనే గడిచిపోతోందని కవిత తన ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

బ్యాంకుల్లో పనిభారం ఏ స్థాయిలో ఉందంటే.. పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి చాలా మంది ఉద్యోగులు రాత్రి 9 లేదా 10 గంటల వరకు కూడా ఆఫీసుల్లోనే ఉండి పని చేయాల్సి వస్తోందని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టెక్నాలజీ వాడకం పెరిగిపోయిందని, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయని చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితుల్లో బ్యాంకు ఉద్యోగుల పనిభారం మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఆమె విమర్శించారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న బ్యాంకర్ల ఆరోగ్యం, వారి కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, పని ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా వెంటనే ఐదు రోజుల పని దినాలను (ఫైవ్ డేస్ వర్కింగ్) అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కవిత స్పష్టం చేశారు.

గొప్పల కోసం అప్పుల పాలు కావొద్దు: విజయ్ దేవరకొండ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు