క్రైమ్ మిర్రర్,సినిమా :- ప్రస్తుత సమాజంలో యువత ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లు, ఆధునిక గ్యాడ్జెట్ల వ్యామోహంలో పడిపోతున్నారు. సమాజంలో ఇతరుల ముందు తమను తాము గొప్పగా చూపించుకోవాలనే తాపత్రయంతో చాలా మంది తమ స్తోమతకు మించిన ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా తమ వద్ద తగినంత ఆదాయం, డబ్బు లేకపోయినా సరే, కొందరు అప్పులు చేసి మరీ అత్యంత ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి విలాసాల మోజులో పడి భవిష్యత్తును ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు.
సమాజంలో నానాటికీ పెరుగుతున్న ఈ కల్చర్‌పై ప్రముఖ హీరో విజయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం పక్కవారికి గొప్పలు పోవడం కోసం అప్పులు చేసి వస్తువులు కొనే అలవాటును ఆయన సున్నితంగా మందలించారు. ఈ సందర్భంగా ఆయన వాస్తవ పరిస్థితులను వివరిస్తూ.. “సెలబ్రిటీలుగా మాకు చాలా రకాల ఫోన్లు గిఫ్ట్‌లుగా వస్తుంటాయి. కాబట్టి మేము ప్రత్యేకంగా మా డబ్బులు ఖర్చుపెట్టి కొత్తవి కొనాల్సిన అవసరం ఉండదు” అని ఆయన అసలు విషయాన్ని వెల్లడించారు.
కానీ సామాన్య ప్రజలు కేవలం ఆకర్షణకు లోనై గుడ్డిగా అనుకరించడం వల్ల నష్టపోతారని ఆయన పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశారు. “డబ్బులు ఉన్నా లేకపోయినా కేవలం షో కోసం, ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం అప్పులు చేసేవారు కాస్త కామన్ సెన్స్ వాడాలి” అని విజయ్ తన అభిమానులకు సూచించారు. తాత్కాలిక ఆనందాల కోసం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండటమే ఉత్తమమని ఆయన హితవు పలికారు.
సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లో మరోషాక్…! రంజీ ట్రోపిలో దక్కని చోటు…
