ఢిల్లీ, క్రైమ్‌మిర్రర్: టీమిండియాలో స్టార్ బ్యాటర్ కీలక ఆటగాడిగా పేరొందిన సూర్యకుమార్ యాదవ్‌కు షాక్‌లమీదషాక్‌లు తగులుతూనే ఉన్నాయి. టీమిండియాలో ఇప్పటికే మూడు ఫార్మట్‌లో చోటు కోల్పోయిన సూర్యకుమార్ తాజా ముంబై రంజీ జట్టులోను స్థానం దక్కలేదు. చండీగఢ్‌తో అక్టోబర్ 11న ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ కోసం ప్రకటించిన ముంబై జట్టులో అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. సూర్యకుమార్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు.
కాగా మరోవైపు యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రేకు సెలక్టర్లు కీలక బాధ్యతలు అప్పగించారు. అతడిని జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు. భవిష్యత్‌లో ముంబై జట్టుకు నాయకత్వం వహించేలా 19 ఏళ్ల మాత్రేను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత అండర్-19 జట్టును ప్రపంచకప్ విజేతగా నిలిపిన మాత్రేకు ఇప్పటివరకు 13 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం మాత్రమే ఉంది.
సందేశం జట్టులో చోటుగల్లంతు…
ముంబై సెలక్షన్ కమిటీని సూర్యకుమార్ యాదవ్ తాను అందుబాటులో ఉంటున్నానని సందేశం పంపినప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోలేదని సమాచారం. కాగా గత 18 నెలలుగా సూర్యకుమార్ యాదవ్ ఒక్క రెడ్‌బాల్ క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. రెడ్ బాల్ క్రికెట్‌లో అతని ఫాం పై సెలెక్టర్‌లకు నమ్మకం కుదరలేదు. ముందుగా కొన్ని మ్యాచ్లు ఆడి మళ్లీ రిథమ్ అందుకోవాలని సూచించారు. సూర్యకుమార్ ఎంపిక చేయకపోవడంపై ముంబై సెలక్షన్ కమిటీ చైర్మన్ రమేశ్ పవార్ వివరణ ఇచ్చారు. సూర్య ముంబై తరుపున చాలా మ్యాచ్‌లు ఆడాడు. ఎన్నో మ్యాచ్‌లో జట్టును గెలిపించారు. మళ్లీ రిథమ్‌లోకి రావాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత అతడిని జట్టులకోకి తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఇవి కూడ చదవండి:
-
ముంబై పోలీసులమంటూ వృద్దుడికి సైబర్ నేరగాళ్ల భారీ టోకరా…!
-
దసరా పండుగ సెలవులు ఖరారు: విద్యాసంస్థలకు కఠిన నిబంధనలు జారీ చేసిన తెలంగాణ సర్కార్!
-
పేదల సొంతింటి కలను జగన్ ఛిద్రం చేశారు : కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
-
రష్యాలో కలకలం….అంతుచిక్కని వ్యాధితో ల్యాబ్ వర్కర్ మృతి…!
