
Ayatollah Ali Khamenei: ఇజ్రాయెల్ తో యుద్ధం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తొలిసారి బయకు వచ్చారు. సెంట్రల్ టెహ్రాన్ లోని ఓ మసీదులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖమేనీ అక్కడికి రాగానే, మసీదులోని ప్రజలంతా లేచి నిలబడి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన నాయకత్వానికి మద్దతుగా జయ జయ ధ్వానాలు చేశారు. పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది.
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు
ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్ మీద ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. అణు స్థావరాలతో పాటు సైనిక స్థావరాలపై వైమానిక దాడులకు దిగింది. ఖమేనీ అధికారిక నివాసంతోపాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ యద్ధం నేపథ్యంలో ఖమేనీ రహస్య బంకర్ లో దాక్కున్నారు. ఎలాంటి సిగ్నల్స్ అందని ప్రదేశంలో ఆయనను భద్రతా సిబ్బంది ఉంచారు. ఖమేనీ ఉన్న ప్రాంతంలో ఎలాంటి సిగ్నల్స్ అందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యంత రహస్య ప్రాంతంలో అయనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
గత నెల 11న సైనిక కమాండ్ సమావేశంలో పాల్గొన్న ఖమేనీ
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కు చెందిన అత్యున్నత స్థాయి సైనిక కమాండర్లు చనిపోయారు. నిజానికి ఆ దేశంలో సైనిక కమాండర్లు చనిపోతే ఖమేనీ ప్రార్థనలు చేస్తారు. కానీ, ఇజ్రాయెల్ దాడుల్లో కీలక సైనికాధినేతలు, అటామిక్ సైంటిస్టులు చనిపోయినా, ఆయన కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు. బయటయకు వస్తే ఇజ్రాయెల్ చంపేస్తుందనే నిఘా వర్గాల హెచ్చరికలతో ఆయన బయటకు రాలేదు. ఖమేనీ చివరి సారిగా జూన్ 11న సైనిక కమాండర్ల సమావేశంలో కనిపించారు. యుద్ధం ముగిసిన తర్వాత ఆయన ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఓ వీడియోను విడుదల చేశారు. కానీ, బయట కనిపించలేదు. ఎట్టకేలకు మసీదులో ప్రత్యక్షం అయ్యారు. ఇరాన్ తో పూర్థి స్థాయిలో యుద్ధం సమసిపోయిన నేపథ్యంలో ఇకపై ఆయన బయట కనిపించే అవకాశం ఉన్నట్లు ఆదేశ ఉన్నత స్థాయి సైనిక అధికారులు చెప్తున్నారు.
Read Also: అమెరికాలో పుట్టిన మరో పార్టీ, పేరు ప్రకటించిన ఎలన్ మస్క్!