Homeఅంతర్జాతీయంపాక్ ప్ర‌ధానికి ఇరాన్ అధ్య‌క్షుడి ఫోన్‌...!ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న‌...!

పాక్ ప్ర‌ధానికి ఇరాన్ అధ్య‌క్షుడి ఫోన్‌…!ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న‌…!

  • అమెరికా మోస‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తుంది…ఇరాన్ అద్య‌క్షుడు

 

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: హార్మూజ్ జ‌ల సంధి వ‌ద్ద రోజు రోజుకు మ‌ళ్లీ ఉద్రిక్త‌లు తీవ్ర‌మ‌వుతున్నాయి. ఇరాన్ నౌక‌ను అమెరికా స్వాధీనం చేసుకోవ‌డంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడారని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా తీరుపై పెజెష్కియాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. అమెరికా అసంబ‌ద్ద‌మైన డిమాండ్ల‌తో, బెదిరింపుల‌తో అప‌న‌మ్మ‌కం పెరిగింద‌ని తెలిపారు. దౌత్యానికి తిలోదకాలు ఇచ్చిన యూఎస్ మోసపూరితంగా పాత పద్ధతిలోనే ముందుకు సాగుతున్నట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

ఇరాన్, యూఎస్ మాధ్య రాజీ కుదురుస్తామని పాక్ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 12న ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, యూఎస్‌ల మధ్య జరిగిన చర్చలు ఏటూ తేలకుండా ముగిశాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న 14 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు మరోసారి పాక్‌ వేదికగా చర్చలు జరపాల్సి ఉండగా తాము సిద్ధంగా లేమని ఇరాన్ ప్రకటించింది. అమెరికా బెదిరింపులు, అసంబ్ధమైన డిమాండ్స్‌యే ఇందుకు కారణమని పేర్కొంది.

ప్రస్తుతం ఇరాన్ నౌక తౌస్కా యూఎస్ కస్టడీలోనే ఉంది. తౌస్కాపై గతంలోనే ఆంక్షలు విధించామని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. నౌకలో తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు