Homeఅంతర్జాతీయంభారత్ కు ఎవరి పర్మిషన్ అవసరం లేదు : రష్యా రాయబారి

భారత్ కు ఎవరి పర్మిషన్ అవసరం లేదు : రష్యా రాయబారి

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- భారత్ మరియు రష్యా దేశాలు ఎంత స్నేహబంధంగా ఉంటాయో మనందరికీ తెలుసు. తాజాగా మన భారత్ పై రష్యా మరోసారి తన గౌరవాన్ని,స్నేహాన్ని చాటుకుంది. భారత్ మరియు రష్యా మధ్య సంబంధాన్ని అమెరికా దెబ్బతీయాలని చూస్తుంది. కానీ ఎక్కడ కూడా దెబ్బ తినకుండా ఉండేందుకు రష్యా వ్యవహరిస్తున్న తీరు ఆ దేశం పై మరింత అభిమానాన్ని పెంచుకుంటుంది. ఇక తాజాగా రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు ఇండియాకు తాత్కాలికంగా పర్మిషన్ ఇచ్చామని అమెరికా వ్యాఖ్యలపై మన దేశంలో ఉన్నటువంటి రష్యా రాయబారి అలిపోవ్ స్పందిస్తూ అమెరికాకు కౌంటర్ ఇచ్చారు.

మా నుంచి ఆయిల్ కొనడానికి ఇండియాకు ఏ దేశం నుంచి కూడా పర్మిషన్ అవసరం లేదు అని స్పష్టం చేసింది. అమెరికా అధికారులు వారి అసలు రూపాన్ని మరోసారి బయటకు తెలియజేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. అమెరికా కావాలనే ఇతర దేశాలను భాగస్వాములుగా కాకుండా తక్కువ స్థాయి దేశాలుగా చూస్తుంది అని రష్యా రాయబారి అనడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. భారత్ మరియు రష్యా మధ్య ఉన్నటువంటి స్నేహం ఎప్పటికీ విడిపోదు అనే విధంగా రష్యా రాయబారి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరుదేశాలు విడిపోయే విధంగా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది అని కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ భారత్ మరియు రష్యా మధ్య సంబంధం ఎప్పటికీ విడిపోదు అనే విధంగా ఇరుదేశాలు వ్యవహరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి ..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు