Homeక్రైమ్చింతపల్లిలో మళ్లీ తెరలేపిన అక్రమ వెంచర్...!

చింతపల్లిలో మళ్లీ తెరలేపిన అక్రమ వెంచర్…!

  • చింతపల్లిలో మళ్లీ తెరలేపిన అక్రమ వెంచర్

  • నిబంధనలకు పాతరేసి, ప్రభుత్వ భూమిపైనా కన్ను..!?

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): జిల్లాలోని చింతపల్లి మండలం, గడియ గౌరారంలో రియల్ ఎస్టేట్ మాఫియా మళ్లీ రెచ్చిపోయింది. డీటీసీపీ, రేరా అనుమతులు లేకుండా, పంచాయతీ లేఔట్ అప్రూవల్ కూడా పొందకుండా, గడియ గౌరారం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 24, 25లలో, సుమారు 8 ఎకరాల 24 గుంటల విస్తీర్ణంలో అక్రమ వెంచర్ వెలిసింది.! గతంలో ‘క్రైమ్ మిర్రర్’ కథనంతో అధికారులు స్పందించి పనులు ఆపేసినా, ఇప్పుడు మళ్లీ అదే వెంచర్‌లో యథేచ్ఛగా ప్లాట్ల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. అమాయక ప్రజలను నిలువునా ముంచేందుకు రియల్టర్లు సిద్ధమవుతుండగా, అధికారుల మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది.

అనుమతులు లేకున్నా అమ్మకాలు..ప్రభుత్వ భూమి కబ్జాకు సైతం కుట్ర.!?

చింతపల్లి మండలం గడియ గౌరారం శివారులో వెలసిన ఈ అక్రమ వెంచర్‌కు కనీసం డీటీసీపీ అనుమతులు కానీ, స్థానిక గ్రామ పంచాయతీ లేఔట్ అప్రూవల్ కానీ లేవని తెలుస్తుంది.! అయినా రియల్ ఎస్టేట్ నిర్వాహకులు ఎలాంటి భయం లేకుండా, బహిరంగంగానే ప్లాట్లు అమ్ముతున్నారనేది ఓపెన్ సీక్రెట్..! నగరానికి దూరంగా ఉన్న ఈ వెంచర్‌కు కస్టమర్లను ఉచితంగా తీసుకెళ్లడం, విందు భోజనాలు పెట్టడం, “రేపు ధరలు డబుల్ అవుతాయని, ఇప్పుడే బుక్ చేసుకోండని, వారిని మోటివేషన్ చెయ్యడం, మానసికంగా ఒత్తిడి చేయడం వీరి ట్రేడ్ మార్క్‌గా మారింది.

అనుమతులు లేకున్నా అమ్మకాలు..ప్రభుత్వ భూమి కబ్జాకు సైతం కుట్ర.!?
అనుమతులు లేకున్నా అమ్మకాలు..ప్రభుత్వ భూమి కబ్జాకు సైతం కుట్ర.!?

దీనికంటే దారుణం ఏమిటంటే, ఈ వెంచర్‌ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కూడా, తమ ప్లాట్లలో కలిపేసుకునేందుకు నిర్వాహకులు కుట్ర పన్నుతున్నట్లు స్థానికుల ఆరోపణ. ఇప్పటికే అమాయక కొనుగోలుదారులను నమ్మించి, సర్కారు భూమిని, కూడా విక్రయించే ప్లాన్‌తో ఉన్నారని, వెంచర్ లోకి వెళ్లే ప్రభుత్వం భూమిని బాటగా మలుచుకుంటున్నారని పలువురు చెబుతున్నారు.!

Also Read: విమాన ప్రయాణీకులకు శుభవార్త.. తక్కువ బడ్జెట్‌తో బేసిక్‌ ఫేర్‌ కేటగిరీ.! – Crime Mirror

దీనిపై వెంటనే ప్రభుత్వ సర్వే అధికారుల ద్వారా భూమి కొలతలు తీయించి, ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేని ప్లాట్లకు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు కావని, ఇళ్లు కట్టుకోవడానికి అధికారులు అనుమతించరని తెలిసినా, రియల్టర్లు మాత్రం అమ్మకాలు ఆపడం లేదు.

  • క్రైమ్ మిర్రర్' కథనానికి స్పందించిన అధికారులు.. మళ్లీ మొదటికొచ్చిన కథ
    క్రైమ్ మిర్రర్’ కథనానికి స్పందించిన అధికారులు.. మళ్లీ మొదటికొచ్చిన కథ

గతంలో ‘క్రైమ్ మిర్రర్’ ఈ అక్రమ వెంచర్‌పై, పరిశోధనాత్మక కథనం ప్రచురించడంతో, జిల్లా స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. చింతపల్లి తహసీల్దార్ విజయలక్ష్మి తన బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ విజయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ సురేష్, స్థానిక సర్పంచ్ ఉజ్జిని హేమలత, నరేందర్ రావు, జీపీవో పాండరయ్యలతో కలిసి వెంచర్ ప్రాంతాన్ని సందర్శించారు.

Also Read: రైతు భరోసా విడుదలకు ముహుర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే – Crime Mirror

ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమతులు లేవని తేలడంతో, ప్లాట్ల విక్రయం కోసం నాటిన రాళ్లను వెంటనే తొలగించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వెంచర్లు ఏర్పాటు చేస్తే సహించేది లేదని, అనుమతి పత్రాలు సమర్పించే వరకు పనులు ఆపాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మరో విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. అధికారుల నోటీసులను బేఖాతరు చేస్తూ, వారి కళ్లుగప్పి మళ్లీ అదే వెంచర్‌లో విక్రయాలు మొదలుపెట్టారు నిర్వాహకులు.

క్రైమ్ మిర్రర్' కథనానికి స్పందించిన అధికారులు.. మళ్లీ మొదటికొచ్చిన కథ
క్రైమ్ మిర్రర్’ కథనానికి స్పందించిన అధికారులు.. మళ్లీ మొదటికొచ్చిన కథ

అక్రమ వెంచర్ల ఉచ్చులో పడి సామాన్యులు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నా, ఆచరణలో మాత్రం కఠిన చర్యలు శూన్యం. అనుమతులు లేని ప్లాట్లకు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు కావని, ప్లాట్లు కొనే ముందు డీటీసీపీ అనుమతులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని, అక్రమ లేఔట్లలో ఇళ్లు నిర్మిస్తే కూల్చివేత ముప్పు ఉంటుందని అధికారులు చెబుతున్నా, వెంచర్ నిర్వాహకులు మాత్రం దర్జాగా దందా కొనసాగిస్తున్నారు.

Also Read: వ్య‌వ‌సాయ రంగంపై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం..! – Crime Mirror

జిల్లా కలెక్టర్, ఆర్డివో వెంటనే స్పందించి ఈ అక్రమ వెంచర్‌ను పూర్తిగా సీజ్ చేయాలని, ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా సరిహద్దులు నిర్ణయించి బోర్డు ఏర్పాటు చేయాలని, అనుమతులు లేకుండా ప్లాట్లు అమ్ముతున్న నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

నిబంధనలకు పాతరేసి, ప్రభుత్వ భూమిపైనా కన్ను..!?
నిబంధనలకు పాతరేసి, ప్రభుత్వ భూమిపైనా కన్ను..!?

అధికారుల మౌనం వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కావని, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో సామాన్యుడి సొమ్ము గాలిలో కలిసిపోక తప్పదని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఈ అక్రమ వెంచర్ వెనుక ఉన్న లీడర్ వల్లే, అధికారులు చర్యలు తీసుకోవడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. చూడాలి మరి అధికారులు ఏ విధంగా చర్య తీసుకోనున్నారో…

Also Read: ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం…! – Crime Mirror

Also Read: ఖగోళ అందాలను ఆస్వాదించండి.. ఎప్పుడు, ఎలా చూడాలి..? – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు