Homeజాతీయంకోల్‌కతాలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రం గుట్టురట్టు.. తుపాకులు, తూటాలు స్వాధీనం

కోల్‌కతాలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రం గుట్టురట్టు.. తుపాకులు, తూటాలు స్వాధీనం

క్రైమ్ మిర్రర్ : కోల్‌కతాలో అక్రమంగా తుపాకులు తయారు చేస్తున్న కేంద్రాన్ని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) పోలీసులు గుర్తించారు. నాడియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయూబ్‌నగర్‌లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాడి సమయంలో పోలీసులు రెండు 7-MM తుపాకులు, మరో రెండు దేశీయంగా తయారు చేసిన తుపాకులు, వివిధ రకాల తూటాలు, పేలిన తూటాలతో పాటు ఆయుధాల తయారీకి ఉపయోగించే పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు దాడి చేయబోతున్నారనే సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నాడియల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమ ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ అక్రమ ఆయుధాల తయారీ వెనుక ఎవరున్నారు? వీటిని ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
also read : రాజ‌కీయ ల‌భ్దికోసం రాజ్యంగ సంస్థ‌ల‌పై దుష్ప్ర‌చారాలు మానుకోవాలి…! రాజ్యాంగ సూత్రాల‌కు క‌ట్టుబ‌డి ఉండాలి…హార్వ‌ర్డ్ ప్ర‌తినిధులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు