చిత్తూరు, క్రైమ్‌మిర్రర్: చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లి గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది.వివరాల ప్రకారం భార్య నిర్మల గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.
Also Read:చర్చలు విఫలమైతే ఇక అంతే.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు స్ర్టాంగ్ వార్నింగ్
భార్య అనారోగ్యాన్ని చూసి తీవ్ర మనస్థాపానికి గురైన భర్త దామోదర్, కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మొదట తన భార్యకు, ఇద్దరు పిల్లలు దిలీప్ (కుమారుడు – 8వ తరగతి విద్యార్థి), శ్రీవిద్య (కుమార్తె – 6వ తరగతి విద్యార్థిని)లకు విషం ఇచ్చాడు. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read:అయోధ్య విరాళాల వివాదంపై సిట్ నివేదిక.. యోగీ యాక్షన్ షూరూ.!
ఆత్మహత్యకు ముందు దామోదర్ ఒక లేఖ రాసి పెట్టాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదని అందులో స్పష్టం చేశాడు. అంతేకాకుండా, తన ఏటీఎం కార్డులో డబ్బులు ఉన్నాయని, ఆ డబ్బును డ్రా చేసి తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియల ఖర్చులకు ఉపయోగించాలని ఆ లేఖలో కోరడం అందరినీ కలిచివేసింది.
గ్రామంలో విషాద ఛాయలు…
Also Read:వైసిపికి కాపు కాసేలా.. నేడు కాపు నేతల కీలక భేటీ.!
ఒకే కుటుంబంలో నలుగురు, ముఖ్యంగా ఇద్దరు చిన్నపిల్లలు మృతిచెందడంతో బంగారెడ్డిపల్లి గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ కుటుంబంలో అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరూ మిగలకపోవడంతో బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్తూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.