రంగారెడ్డి, క్రైమ్‌మిర్రర్: ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని బడంగ్‌పేట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో అక్కడ కలకలం రేపింది. మృతుడు డకరేషన్ గోదాములో పని చేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలని మీర్‌పేట పోలీసు పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
Also Read:చర్చలు విఫలమైతే ఇక అంతే.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు స్ర్టాంగ్ వార్నింగ్
కాగా మృతుడు పశ్చిమబెంగాల్‌లోని కోలకతాకు చెందిన అనూప్ ప్రధాన్|43)గా గుర్తించారు. జీవనోపాధి కోసం మూడు రోజుల క్రితమే డకేరేషన్ గోదాంలో పని చేస్తున్నారు. ఈఘటన సమయంలో అనూప్ ప్రధాన్ చెత్త సమీపంలో ఉన్నాడు. ఆ సమయంలో ఆ చెత్తలో ఉన్న గుర్తుతెలియని భారీ పేలుడు సంభవించడంతో అనూప్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
పేలుడు తీవ్రతో ఎగిరిపడ్డ శరీర భాగాలు…
Also Read:పవన్ మార్క్ పోలీసింగ్.. హోంశాఖపై వ్యాఖ్యలు వెనుక మర్మం అదేనా.!
పేలుడు ప్రభావం తీవ్రంగా ఉండటంతో మృతుడి శరీర భాగాలు సుమారు 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. చేతులు, కాళ్లు తునాతునకలైపోవడంతో ఘటన స్థలం భయానకంగా మారింది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటన స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. నిలిచిపోయిన పెళ్లి.!
ప్రస్తుతం పేలుడు ప్రమాదవశాత్తూ జరిగిందా, లేక చెత్త కుప్పలో పేలుడు పదార్థం ఉండటమే కారణమా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. అవసరమైతే బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో మరిన్ని వివరాలు సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు ఫోరెన్సిక్ నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read:Agricultural Loans: రైతులకు సులభంగా రుణాలు.. రూ.2 లక్షల వరకు తాకట్టు అవసరం లేదు!