కాకినాడ, క్రైమ్ మిర్రర్ :కాకినాడ రెడ్ క్రాస్ దగ్గర ఒక వ్యక్తి గొంతును దుండగులు కోసారు.కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటనకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితుడు రోడ్డుపై నడుస్తు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాడి జరిగింది. ఈ దాడితో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.. ఘటన ప్రాంతం,పరిసర ప్రాంతాల పరిస్థితులను పోలీసులు క్లూస్ టీం పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితులు కదలికలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పాత కక్షలా లేక వ్యక్తిగత కక్షల అనేదానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.. మృతుడు జి నాగేశ్వరరావు, 46 ఏళ్ల ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.