Homeక్రైమ్అమ్మ బాబోయ్.. ఇందుగుల ధాన్యం కొనుగోలులో నిలువు దోపిడీ

అమ్మ బాబోయ్.. ఇందుగుల ధాన్యం కొనుగోలులో నిలువు దోపిడీ

  • ఇందుగుల పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో నిలువు దోపిడీ

  • క్వింటాకు 4 నుంచి 6 కిలోల అక్రమ కోత

  • పత్తాలేని తిప్పర్తి పీఏసీఎస్ అధికారులు

  • విలేకరుల ఎదుట రైతుల ఆవేదన

క్రైమ్ మిర్రర్, మాడుగులపల్లి ప్రతినిధి: మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో తిప్పర్తి పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు కొనుగోలు సిబ్బంది.

కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతుల వద్ద ఒక్కో క్వింటాకు ఏకంగా 4 నుంచి 6 కిలోల వరకు అక్రమంగా కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా, ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతుల వద్ద ఒక్కో క్వింటాకు ఏకంగా 4 నుంచి 6 కిలోల వరకు అక్రమంగా కోత విధిస్తున్నారని మొరపెట్టుకున్నా, పీఏసీఎస్ అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదని పత్రికా విలేకరుల ఎదుట రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే కొనుగోలు కేంద్రంలో ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కకపోగా, ఇలా తూకాల్లో బహిరంగంగా మోసాలకు పాల్పడితే తాము అప్పుల పాలై రోడ్డున పడాల్సిందేనని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఇందుగుల కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విధులకు గైర్హాజరవుతున్న పీఏసీఎస్ సిబ్బందిపై, తూకాల్లో కోత విధించే వారి పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రైతాంగం కోరుతోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు