HomeUncategorizedశివ భ‌క్తుల‌కు శుభ వార్తా... తెరుచుకున్న కేదార్ నాథ్‌ ఆలయం...!

శివ భ‌క్తుల‌కు శుభ వార్తా… తెరుచుకున్న కేదార్ నాథ్‌ ఆలయం…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: ఉత్త‌ర‌ఖండ్ లోని ఆధ్యాత్మిక ప‌విత్ర పుణ్య క్షేత్ర‌మైన శ్రీ‌కేథార్ నాథ్ ఆల‌యం ఆరు నెల‌ల సుదీర్ఘ శీతాలం అనంత‌రం భ‌క్తుల ద‌ర్శ‌నం కోసం తెరుచుకున్నాయి. హిమాల‌య‌లోని మంచు కొండ‌ల్లో కొలువైన కేథార్‌నాథ్ ఆల‌యం బుధ‌వారం ఉద‌యం 8గంట‌ల‌కు వైభ‌వంగా తెరుచుకుంది.

కాగా వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య సుమారు 51 క్వింటాళ్ల పూలతో అందంగా అలంకరించిన ఈ పుణ్యక్షేత్రం భక్తులకు స్వాగతం పలికింది. స్వామి వారి సందర్శనార్థ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు, రేపు విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. కాగా గ‌డ్డ క‌ట్టే చ‌లిని సైతం లెక్క‌చేయ‌కుండా శివ‌య్య‌ను ద‌ర్శించుకునేందుకు రికార్డు స్థాయిలో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు.

యాత్ర సుఖ‌మ‌యంగా సాగాలి…మోడీ

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సందేశాన్ని ఇచ్చారు. చార్‌ధామ్ యాత్ర మన దేశ విశ్వాసానికి, ఐక్యతకు మరియు సుసంపన్నమైన సంప్రదాయాలకు దివ్య ఉత్సవం వంటిదని ఆయన పేర్కొన్నారు.ప్రతి ఒక్కరి యాత్ర సుఖమయంగా సాగాలని, బాబా కేదార్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు