హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ర్టంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెంచిన డీఏను అక్టోబర్ 2026 జీతంతో కలిపి వేయనున్నటు్ల తెలిపింది. జనవరి 2024 నుంచి డీఏను 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంచింది. అలాగే జూలై 2024 నుంచి డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 2015 పే స్కేల్ ఉద్యోగులకు కూడా డీఏను 73.344 శాతం నుంచి 78.06 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 2024 నుంచి 78.06 శాతం నుంచి 81.728 శాతానికి, 2020 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచింది.
యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేళ్ల ఉద్యోగులకు కూడా డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 46 శాతం నుంచి 50 శాతానికి, జూలై 2024 నుంచి డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచింది. అలాగే 2006 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 230 శాతం నుంచి 239 శాతానికి, జూలై 2024 నుంచి 239 శాతం నుంచి 246 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న డీఏ బకాయిలను 33 వాయిదాల్లో ప్రభుత్వం చెల్లించనుంది. అదే విధంగా జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న డీఏ బకాయిలను 27 వాయిదాల్లో చెల్లింపులు జరుపనుంది. డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడ చదవండి:
- మంత్రి పర్యటనలో అనుకోని ప్రమాదం.. సర్వీస్ రైఫిల్ పేలడంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
-
హోంగార్డు ఉద్యోగం కోసం చెప్పులు లేకుండా 1600 మీటర్లు.. 6 నిమిషాల్లోనే పూర్తి చేసిన వితంతువు!
-
ధనుష్ రాజకీయాల్లోకి ఎంట్రీ? కొత్త పార్టీపై జోరుగా ప్రచారం.. అసలు నిజమేంటి?
-
పెద్దపులి కలకలం…! భయాందోళనలో ప్రజలు…
