Homeతెలంగాణప‌సిడి ధ‌ర‌లు ఢ‌మాల్‌... హైద‌రాబాద్ లో ఎంతంటే...!

ప‌సిడి ధ‌ర‌లు ఢ‌మాల్‌… హైద‌రాబాద్ లో ఎంతంటే…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌:ప‌శ్చిమాసియా యుద్దం అంత‌ర్జాతీయ మార్కెట్ల‌పై తీవ్ర క‌నిపిస్తోంది. బంగారం ద‌ర‌లు భారీగ్గాయి. హ‌ర్మూజ్‌ను తెర‌వేక‌పోతే ఇరాన్‌లో ఉన్న ప‌వ‌ర్ ప్లాంట్‌లు, వంతెల‌ను కూల్చేస్తామ‌ని ట్రంప్ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో మార్కెట్‌లు కుదేల‌య్యాయి. యుద్దం మ‌రిన్ని రోజులు కొన‌సాగ‌నుంద‌ని ట్రంప్ పేర్కొన‌డంతో బంగారం ధ‌ర‌లు ఒక్క‌సారిగా కుప్ప కూలాయి.

హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌లు…

శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,50,920 దగ్గర.. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 1,38,340 దగ్గర.. 18 క్యారెట్స్ బంగారం ధర రూ.1,13,190 దగ్గర ట్రేడ్ అయింది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో.. 24 క్యారెట్లపై రూ. 1800.. 22 క్యారెట్లపై రూ.1650..18 క్యారెట్లపై రూ. 1350 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,130.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,700.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,850లుగా ఉంది. బంగారం ధ‌ర‌లు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంటాయి కావున కొనుగోలు దారులు ధ‌ర‌లు తెలుసుకొని కొనుగోలు చేయాలి.

తాజావార్తలు