Homeతెలంగాణ​చింతపల్లి: ప్రజా సేవలో 'వరికుప్పల' ఆదర్శం

​చింతపల్లి: ప్రజా సేవలో ‘వరికుప్పల’ ఆదర్శం

ప్రజా సేవలో ‘వరికుప్పల‘ ఆదర్శం

గడియ గౌరారంలో తీరనున్న దాహార్తి

​ఎన్నికల్లో ఓడినా.. ప్రజా సేవలో గెలిచిన వివిఆర్.

​సొంత నిధులతో 250 ఫీట్ల బోర్ వెయించిన వెంకట్ రాములు.

అధికారుల స్పందన కోసం గ్రామస్తుల ఎదురుచూపు

​చింతపల్లి (క్రైమ్ మిర్రర్): పదవి ఉన్నా లేకపోయినా, సేవ చేయాలనే సంకల్పం ఉంటే, అసాధ్యం ఏదీ లేదని వివిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్, వరికుప్పల వెంకట్ రాములు మరోసారి నిరూపించారు. రాజకీయాలకు అతీతంగా, మానవత్వమే పరమావధిగా ఆయన సాగిస్తున్న, సేవా యజ్ఞం ఇప్పుడు చింతపల్లి మండలంలో మారుమోగుతోంది.

రానున్నది కఠినమైన వేసవి కాలం కావడంతో, చుక్క నీటి కోసం గ్రామస్థులు అల్లాడకూడదనే దూరదృష్టితో, చింతపల్లి మండల పరిధిలోని గడియ గౌరారం, గ్రామ ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు వెంకట్ రాములు నడుం బిగించారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా, తన సొంత నిధులతో సుమారు 250 ఫీట్ల లోతు గల బోర్ వేయించి, గ్రామస్తుల పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు.

*​ఓటమిని వెక్కిరించిన సేవా గుణం*

మొన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో, స్వల్ప మెజారిటీతో విజయం చేజారినప్పటికీ, ఆయన ఏనాడూ ప్రజలకు దూరం కాలేదు. పదవి అనేది ఒక బాధ్యత మాత్రమే, కానీ సేవ అనేది నా అంతరాత్మ అన్నట్లుగా, ఆయన వ్యవహరిస్తున్న తీరు గడియ గౌరారం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్వార్థ రాజకీయాల యుగంలో, ఓడిపోయినా కుంగిపోకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న, వెంకట్ రాములును చూసి ఊరంతా, శభాష్ వరికుప్పల అంటూ కొనియాడుతున్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…గ్రామ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటమే నా లక్ష్యమని, వివిఆర్ ఫౌండేషన్ ద్వారా సామాన్యుడి కష్టాన్ని తీర్చడంలో, నాకు లభించే తృప్తి వేల కోట్ల సంపాదనలో కూడా దొరకదని వెంకట్ రాములు అన్నారు. భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని, ఆయన హామీ ఇచ్చారు.

తన సొంత సంపాదనతో ప్రజా అవసరాల కోసం, బోర్ వేయిస్తే, దానికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద లేదా? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఫౌండేషన్ తరపున బోర్ సిద్ధంగా ఉన్నప్పటికీ, అధికారులు స్పందించకపోవడంపై విమర్శిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మోటార్ బిగించి, పైపులైన్ కనెక్షన్ ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వేసవి తీవ్రత పెరగకముందే అధికారులు చలించి, ఈ నీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

*​మారుమోగుతున్న వివిఆర్ ఫౌండేషన్ సేవలు*

ఈ గొప్ప కార్యంతో గడియ గౌరారం గ్రామంలోనే, కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా వివిఆర్ ఫౌండేషన్ పేరు మారుమోగుతోంది. విపత్కర పరిస్థితుల్లో ఆపన్నహస్తం అందిస్తూ, అభివృద్ధి పనుల్లో ప్రభుత్వాలకు సవాల్ విసిరేలా, ముందుకు సాగుతున్న వెంకట్ రాములును గ్రామస్తులు కృతజ్ఞతలతో ముంచెత్తుతున్నారు. తాను పుట్టిన ఊరికి సేవ చెయ్యాలనే ఆయన సేవా గుణాన్ని కొనియాడుతున్నారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు