Homeతెలంగాణటెక్నికల్, బ్యాంకింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ...జిల్లా కలెక్టర్

టెక్నికల్, బ్యాంకింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ…జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల, క్రైమ్ మిర్ర‌ర్‌: గాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ రీజనల్ సెంటర్లో టెక్నికల్ కోర్సులు, బ్యాంకింగ్ నందు ఉచిత శిక్షణ అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. డిగ్రీ-బీటెక్ అభ్యర్థులకు ఈ నెల 8న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఓరియెంటషన్ కు హాజరు కావాలని సూచించారు. అర్హత,ఆసక్తి ఉన్న అభ్యర్థులకు 11 వ తేదీ నుంచి బ్యాచ్ ప్రారంభం అవుతుందని తెలిపారు.

టాస్క్ నందు శిక్షణ పొందిన అభ్యర్థులకు మంచి ప్యాకేజీలతో ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిగతా వివరాలకు 9573420718, 7075522671 నంబర్లలో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు