హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో శుక్రవారం ఉదయం దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. AMB మాల్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, విట్టల్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అదే సమయంలో బుల్లెట్‌పై ఉన్న వినోద్‌కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సహాయం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి ప్రధాన కారణం రాంగ్ రూట్‌లో ప్రయాణించడం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
also read: మహిళల కోసం రైల్వే కీలక నిర్ణయం – స్టేషన్లలో ఉచిత శానిటరీ ప్యాడ్లు