Homeక్రైమ్నర్సంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంట్లోకి దూసుకెళ్లిన కారు: ఒకరు మృతి

నర్సంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంట్లోకి దూసుకెళ్లిన కారు: ఒకరు మృతి

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ముత్తోజిపేట సమీపంలో అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు కారులో మేడారం వెళ్లేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో ముత్తోజిపేట వద్దకు చేరుకున్న సమయంలో కారు అదుపుతప్పి ఇంటిపైకి దూసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం కారు బోల్తా పడింది.

ప్రమాదంలో గణేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఐదుగురికి గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

also read: రామ్ పోతినేని సినిమాలో బాలీవుడ్ స్టార్ విలన్.. ఈసారి ఢీకొట్టబోతున్నది ఎవరితోంటే?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు