-
నాయకుల వ్యవహారశైలితో విసిగిపోతున్న ప్రజలు
-
ఇంకా క్యాంప్ లోనే ఉన్న కౌన్సిలర్లు
-
రాష్ట్ర ప్రజలు కన్ను క్యాతన్‌పల్లిపైనే…
మంచిర్యాల , క్రైమ్ మిర్రర్: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక పై ఇంకా ఉత్కంఠ రేపుతోంది. గొడవలు, దాడులు కేసులతో రాష్ట్రం కన్ను ఇప్పుడు క్యాతన్‌పల్లిపైనే ఉంది. కాగా బీఆర్ ఎస్, సీపీఐ కౌన్సిలర్లు ఇంకా క్యాంప్‌లోనే ఉన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు మాత్రం తమ ఇళ్లవద్దనే ఉన్నారు. రాష్ట్రఉపాధి కల్పన గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో గతంలో ప్రారంభించిన అభివృద్ది పనులు కౌన్సిలర్లు ప్రారంభిస్తున్నారు.
అంతేగాకుండా రాష్ట్రంలో క్యాతన్‌పల్లి మున్సిపాలిటి గురించే చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు లేకపోవడంతో బీఆర్ ఎస్ సీపీఐ పొత్తు కలిసి వచ్చి 14 సీట్లను గెలుచుకుంది. ఫిబ్రవరి 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండగ సమయానికి బీఆర్ ఎస్, సీపీఐ కౌన్సిలర్లు రాకపోవడంతో వాయిదా పడింది. ఎందుకు సకాలంలో హాజరుకాలేకపోయారని కూడ ప్రజల్లో చర్చ జరుగుతుంది.
ఆ ఒక్క రోజు ఆలస్యమే ఈ గొడవలకు కారణమైందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తిరిగి ఫిబ్రవరి17న చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ఉండగా బీఆర్ ఎస్, సీపీఐతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడ పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో 144 సెక్షన్ విధించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. గొడవలను నియంత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్యే సుమన్ వాహనాన్ని అడ్డుకొని నిబందనల ప్రకారం వెళ్లవద్దని అనడంతో ఆయన వాగ్వివాదానికి దిగారు.
అప్పటికి మోహరించి వారు ఆందోళన చేపట్టడంతో పెద్ద ఎత్తున గొడవకు దారి తీసింది. మంత్రి , ఎంపీ వంశీ ప్రయాణిస్తున్నటువంటి వాహనంపై రాళ్లు రువ్వడంతో ఆ వాహనం అద్దాలు పగిలాయి. మరో కానిస్టేబుల్‌కు తలకు బలమైన గాయాలయ్యాయి. మందమర్రి కాంగ్రెస్ కార్యకర్తకు సైతం గాయాలయ్యాయి.దీంతో పోలీసులకు చెదర కొట్టారు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న కౌన్సిలర్లు కూడ గొడవ జరుగడంతో ఎన్నిక వాయిదా వేశారు.
దీంతో పెద్ద ఎత్తున బీఆర్ ఎస్, సీపీఐ పెద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన కారులను చెదర కొట్టారు. దీంతో బాల్క సుమన్‌తో పాటు 20 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా మరుసటి రోజు బాల్కసుమన్‌తోపాటు ఆయన ముఖ్య అనచరుడైన మూల రాజిరెడ్డిని సైతం అరెస్టు చేసి ఆదిలాబాద్‌కు తరలించారు. ఇంకా కేసులైన నాయకులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు. రెండు రోజుల క్రితం బీఆర్ ఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, బండారి సూరిబాబులను పోలీసులు అరెస్టు చేసి ఆదిలాబాద్‌కు పంపించారు.
ఇంకా మిగితా వారి కోసం గాలిస్తున్నారు. మొత్తానికి 16న సమయానికి హాజరుకాకపోవడంతోనే ఈ గొడవలకు కారణమైందనే చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఒక వైపు ప్రజాస్వామ్యాన్ని మంత్రి అపహస్యం చేస్తున్నాడని బీఆర్ ఎస్, సీపీ ఐ నాయకులు ఆరోపిస్తుండగా మరో వైపు బాల్క సుమన్ తన అనచరులతో అల్లర్లు సృష్టిస్తున్నాడని మంత్రి ఆరోపించారు. తన కారుపై రాళ్లు విసిరిన నేను ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పోలీసులకు గాయాలు కావడంతోనే పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.
అన్ని గొడవలకు వారే కారణమని మంత్రి ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా తన తండ్రి అడుగుజాడల్లో ప్రజా సేవ కోసం రాజకీయల్లోకి వచ్చామని తెలిపారు. ఇప్పటి కూడ వారు దీనిపై ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపారు. భవిష్యత్‌లో క్యాతన్‌పల్లి మున్సిపాలిటి ఎంపిక తేది ఎప్పడు వస్తుందోతెలియడం లేదు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ ఎన్నిక తేదీ ఎప్పుడు వస్తుందోనని క్యాతన్‌పల్లి మున్సిపల్ ప్రజలు ఆసక్తి ఎదురు చూస్తున్నారు.