గుంటూరు, క్రైమ్‌మిర్రర్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనయుడు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కృష్ణ చైతన్య విద్యాసంస్థల పై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ విద్యాసంస్థలకు చెందిన ఆరు జూనియర్ కళాశాలలపై గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన విద్యాశాఖ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. మధ్యాహ్నం ప్రారంభమైన ఈ తనిఖీలు అర్ధరాత్రి దాటే వరకు సాగాయి.అధికారుల సుదీర్ఘ తనిఖీల్లో సదరు విద్యాసంస్థల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను ఏ ఒక్కటి కూడా సక్రమంగా పాటించడం లేదనే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి.
Also Read:Parking Row Turns Deadly: బైక్ పార్కింగ్ గొడవ.. మహిళ ప్రాణం తీసింది!
అగ్నిమాపక శకటం వెళ్లేందుకు కనీస స్థలం లేకపోవడం, ఫైర్ సేఫ్టీ అనుమతులు గడువు ముగిసినా నూతనీకరించకపోవడం, సామర్థ్యానికి మించి ఒకే గదిలో విద్యార్థులను గొర్రెల మందలా ఉంచడం వంటి అనేక లోపాలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ల్యాబ్‌లలో కెమికల్స్ భద్రత సరిగా లేకపోవడం, విద్యార్థులకు కనీస తాగునీరు, పరిశుభ్రమైన శానిటేషన్ వసతులు కూడా కల్పించకపోవడాన్ని కూడా గుర్తించారు.రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఉండేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పొరుగు జిల్లా అయిన గుంటూరుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు.
Also Read:Shashi Tharoor: శశి థరూర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలకలం.. జమ్మూ కశ్మీర్‌పై కొత్త చర్చ!
కాలేజీ రికార్డులు, అటెండెన్స్ రిజిస్టర్లు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్, హాస్టల్ అనుమతులకు సంబంధించిన ప్రతీ పత్రాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అర్ధరాత్రి దాటే వరకు అటెండెన్స్ సాఫ్ట్‌వేర్ డేటాను, అడ్మిషన్ల రికార్డులను క్రాస్ వెరిఫై చేసిన అధికారులు.. అనుమతులు లేని అదనపు సెక్షన్లను నడుపుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించి ఆయా ఫైళ్లను సీజ్ చేశారు.ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు చైర్మన్‌గా ఉన్న విద్యాసంస్థలు కావడంతో, ఐదేళ్ల హయాంలో ఇక్కడి లోపాలపై స్థానిక అధికారులు కన్నెత్తి కూడా చూడలేదనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read:పాదచారుల హక్కులపై బలమైన వ్యాఖ్యలు- ఫుట్‌పాత్‌లపై సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశం
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా రూల్స్ ఉల్లంఘించే కార్పొరేట్ కాలేజీలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ తనిఖీలపై గుంటూరు, నెల్లూరు అధికారులు తుది నివేదికను ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్‌కు సమర్పించనున్నారు. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కిన కృష్ణ చైతన్య విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయడంతో పాటు భారీగా జరిమానా విధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read:ప్రయాణంలో వాంతులు మాయం అవుతాయా? వైరల్ అవుతున్న ‘నాణెం చిట్కా’ నిజమేనా!