Homeఆంధ్ర ప్రదేశ్ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా ఉత్సవాలు: అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో భక్తుల రద్దీ!

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా ఉత్సవాలు: అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో భక్తుల రద్దీ!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దసరా నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఆరంభం కావడంతో తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.

అమ్మవారి దర్శనానికి ముందుగా భక్తులు శనేశ్వర దేవాలయం సమీపంలోని పవిత్ర కృష్ణానది పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో కృష్ణా నది ఘాట్ల ప్రాంతమంతా దుర్గమ్మ భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఘాట్లలో ప్రత్యేక ఏర్పాట్లు, రక్షణ చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, ప్రసాదాలు అందుబాటులో ఉంచారు. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్నాయి.

అద్భుతం….ఇక క‌ళ్ల‌ద్దాల‌తో యూపీఐ పేమెంట్‌…! స్కానర్‌వైపు చూసి హ‌లో జీయో అంటే చాలు….

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు