Homeఆంధ్ర ప్రదేశ్Vishakhapatnam: కార్డేలియా క్రూయిజ్ విహారం చేయాల‌ను ఉందా...! జూన్ 22 నుంచి జూలై 15 వ‌ర‌కు...

Vishakhapatnam: కార్డేలియా క్రూయిజ్ విహారం చేయాల‌ను ఉందా…! జూన్ 22 నుంచి జూలై 15 వ‌ర‌కు అవ‌కాశం…

విశాఖపట్టణం. క్రైమ్‌మిర్ర‌ర్‌: పర్యాటకులకు పండగ లాంటి వార్త. విశాఖలో కార్డేలియా క్రూయిజ్ విహారానికి సిద్ధమైంది. జూన్ 22 నుంచి జూలై 15వ తేదీ వరకూ సముద్రంలో విహరించే అవకాశం మీ ముందు ఉంది. ఈ వివరాలను ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇక ఈసారి విశాఖ నుంచి చెన్నైకు నాలుగుసార్లు, చెన్నై నుంచి విశాఖకు నాలుగుసార్లు కార్డేలియా క్రూయిజ్ షిప్ విహరించనుంది.

తెల్లారి లేచింది మొదలు ఉరుకుల పరుగుల జీవితం.. ఈ కాంక్రీట్ జంగిల్‌లో మనిషన్నవాడు కాస్తా మెషీన్‌గా మారిపోతున్నాడు. రూపాయి వెంట పరుగులతో లైఫ్ స్టైల్ మారి.. అసలైన జీవితాన్ని మర్చిపోతున్నాడు. ఉన్నది ఒకటే జిందగీనని మరిచి.. ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలనే విషయాన్ని విస్మరిస్తున్నాడు. మీరు కూడా ఇలాంటి రొటీన్ బోరింగ్ లైఫ్ స్టెయిల్‌తో అలసి పోయారా.. వెనక్కి తిరిగి చూస్తే ఉద్యోగం, జీతం తప్ప జీవితం లేదని భావిస్తున్నారా.. అలాంటి వారికో అద్భుత అవకాశం.. రోజువారీ పనులను పక్కనబెట్టి,

సరదాగా విహరించాలనుకునేవారికి మంచి ఛాన్స్. విలాసవంతమైన భారీ క్రూయిజ్ షిప్‌లో సముద్రంలో విహరించే అవకాశం ఇప్పుడు మీముందు ఉంది. విశాఖపట్నంలో కార్డేలియా క్రూయిజ్ షిప్ విహారం ఈ నెల నుంచి మొదలుకానుంది. ఈ విషయాన్ని ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.విజయమోహన్‌ వెల్లడించారు. ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధ్యక్షుడు.. కార్డేలియా క్రూయిజ్ షిప్ విహారం వివరాలను వెల్లడించారు.

జూన్ 22 నుంచి జులై 15 వరకూ ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జూన్ 22వ తేదీన కార్డేలియా క్రూయిజ్ చెన్నై నుంచి బయల్దేరుతుంది. జూన్ 24వ తేదీ విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఇక ఈ సంవత్సరం విశాఖపట్నం నుంచి చెన్నైకు నాలుగు సార్లు, చెన్నై నుంచి విశాఖకు నాలుగుసార్లు ప్రయాణించనుంది కార్డేలియా క్రూయిజ్ షిప్.ఈ క్రూయిజ్ షిప్‌ టూర్ కోసం ఎంత ఛార్జీలను వసూలు చేస్తారనే వివరాలను టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ వెల్లడించింది.

ఈ భారీ నౌకలో ఇద్దరు, రెండు రాత్రుళ్లు ప్రయాణించేందుకు రూ.48 వేల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. అలాగే మూడు రాత్రులు ప్రయాణించేందుకు ఇద్దరికి రూ.70 వేలు ఖర్చు అవుతుందని వివరించారు. ఇక కార్డేలియా క్రూయిజ్ షిప్ టూర్‌కు సంబంధించిన టికెట్లు అన్ని ట్రావెల్ ఏజెన్సీలలోనూ దొరుకుతాయని ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ తెలిపింది.కార్డేలియా క్రూయిజ్ 692 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో మొత్తం 11 అంతస్తులు, 796 కేబిన్లు ఉంటాయి. ఒకేసారి 1,600 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించే వీలుంది.

ఇక కార్డేలియా క్రూయిజ్ నౌక లోపల స్టేట్ రూం, సముద్రం చూసేందుకు వ్యూ క్యాబిన్లు, సూట్ రూమ్స్, బాల్కనీ క్యాబిన్, ఛైర్మన్ సూట్ వంటివి అందుబాటులో ఉంటాయి. 2022లో తొలిసారిగా కార్డేలియా క్రూయిజ్ విశాఖ చెన్నై మధ్య సముద్రంలో విహరించింది. అప్పటి నుంచి ఈ నౌక ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందా అని పర్యాటకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు