Homeఆంధ్ర ప్రదేశ్ఘోర విషాదం...పంట కాలువలో ముగ్గురు దుర్మరణం...!

ఘోర విషాదం…పంట కాలువలో ముగ్గురు దుర్మరణం…!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, క్రైమ్‌మిర్ర‌ర్‌: రామచంద్రపురం మండలం వెంకటపాలెం గ్రామ సమీపంలోని పంట కాలువలో స్నానానికి దిగిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనికెళ్ళ రంజిత్ కుమార్(15), బొక్క వీరేంద్ర(18), వేమన పావని(15) మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Also Read:హాస్టల్‌లో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థిని బలవన్మరణం

మృతులు కపిలేశ్వరపురం మండలం అంగర, పడమర ఖండ్రిక, తాతపూడి గ్రామాలకు చెందినవారు. వీరు అక్కాచెల్లెళ్ల పిల్లలు కాగా ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. రామచంద్రపురం మండలం వెలంపాలెం గ్రామంలోని అమ్మ ఇంటికి నిన్న జరిగిన తాతయ్య సంస్కార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చారు. ఈరోజు సమీపంలోని వెంకటపాలెం పంట కాలువలో స్నానానికి వెళ్లి ఈ ప్రమాదానికి గురయ్యారు.

Also Read:ఉత్కంఠ రేపుతున్న ఫిరోజ్‌నగర్ భూ వివాదం…!

ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు మంత్రి సుభాష్ తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనతో వెలంపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read:విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది…!

తాజావార్తలు