పిడుగురాళ్ల, క్రైమ్ మిర్రర్: తుమ్మలచెరువు గ్రామానికి చెందిన యువకుడు, మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగ బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు శుక్రవారం పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, ఎస్సై డి.శివనాగరాజు పోక్సో కేసు నమోదు చేశారు. గురజాల డీఎస్పీ మహేశ్వరరావు ఈ కేసుపై విచారణ చేపట్టారు. బాలికను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.