Homeక్రీడలుఐపీఎల్ క్రికెటర్ విప్రాజ్ నిగమ్ చుట్టూ ముసురుకున్న వివాదం: లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన యువతి

ఐపీఎల్ క్రికెటర్ విప్రాజ్ నిగమ్ చుట్టూ ముసురుకున్న వివాదం: లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన యువతి

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఐపీఎల్ టోర్నీలో సత్తా చాటిన యువ క్రికెటర్ విప్రాజ్ నిగమ్ ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయనపై హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి సంచలన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనను శారీరకంగా వాడుకున్నాడని సదరు యువతి ఆరోపిస్తోంది. ఈ మేరకు విప్రాజ్ సొంత ఊరైన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి చేరుకున్న ఆమె, ఆయన ఇంటి ఎదుట బైఠాయించి నిరసనకు దిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.తనకు న్యాయం చేయాలని ఆ యువతి డిమాండ్ చేయడంతో విప్రాజ్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. విప్రాజ్ తండ్రి స్వయంగా ఆ యువతితో మాట్లాడి, వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన సర్దిచెప్పడంతో సదరు యువతి తన నిరసనను విరమించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఉపాధ్యాయుల‌పై దాడిచేసిన వారిని వ‌దిలేదిలేదు…! మంత్రి నారా లోకేష్‌…

అయితే, ఈ వ్యవహారంపై విప్రాజ్ నిగమ్ వర్షన్ భిన్నంగా ఉంది. ఆ యువతి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం విప్రాజ్ నిగమ్ టీమిండియాతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్నాడు.ఈ వ్యవహారం అటు క్రీడా వర్గాల్లో, ఇటు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విప్రాజ్ కెరీర్‌పై ఈ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. పోలీసుల దర్యాప్తు తర్వాత అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.

మద్యం కుంభకోణంలో జగన్…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు