క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ వైఎస్సార్ సీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పంపించారు.రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే, ప్రస్తుతం కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వరుపుల సుబ్బారావు కలిశారు. పవన్ కళ్యాణ్ ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాకినాడ జిల్లాలో మంచి అనుచరగణం, పట్టున్న వరుపుల సుబ్బారావు చేరికతో ఆ ప్రాంతంలో జనసేన పార్టీకి మరింత రాజకీయ బలం చేకూరుతుందని భావిస్తున్నారు.
ఐపీఎల్ క్రికెటర్ విప్రాజ్ నిగమ్ చుట్టూ ముసురుకున్న వివాదం: లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన యువతి
మరోవైపు, గత కొన్ని రోజులుగా వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటం గమనార్హం. ఇటీవలె ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ నేత మజ్జి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ వరుస వలసలతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. వరుపుల సుబ్బారావు నిర్ణయంపై మరియు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మీ కామెంట్ ఏంటి?
