-
కాంగ్రెస్ అంటనే ద్రోహం….అవినీతి…
-
మిత్రపక్షం డీఎంకేకు వెన్నుపోటు పొడిచింది
బెంగళూరు, క్రైమ్‌మిర్రర్: కాంగ్రెస్ పార్టీకి మోసం, ద్రోహం చేయడమే తెలుసునని, దశాబ్దాలుగా తమిళనాడులో మిత్రపక్షంగా ఉన్న డీఎంకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోడీ విమర్శించారు. ఆదివారం బెంగుళూరు పర్యటనలో భాగంగా హెచ్ఏఎల్ విమానశ్రయం ప్రాంగణంలో ఉదయం అభిమానులకు , బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మా్ట్లాడారు.. కాంగ్రెస్ అంటేనే ద్రోహం, అవినీతి అన్నారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్ నేతల అంతర్గత పోరాటల కారణంగా ప్రజలకు సుపరిపాలన అందడం లేదని మోదీ విమర్శించారు.
ఇక్కడ సీఎం, డీసీఎం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని, సీఎం కుర్చీలోకి వెళ్లాలనే ప్రయత్నాలు మినహా ప్రజా సంక్షేమం వారికి పట్టదని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రాజకీయ స్థిరత్వానికి, అభివృద్ధికి ప్రతిరూపంగా మోదీ అభివర్ణించారు. మోదీ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. కర్ణాటకలో ఏ కుర్చీ కూడా కదలడం లేదని, అన్ని కుర్చీలూ గట్టిగా ఉన్నాయని అన్నారు.
రాష్ట్రంలో సీఎం ఎంతకాలం ఉంటారో తెలియడం లేదని, కుర్చీకోసం పోరాటంసాగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. దీనికి డీకే స్పందిస్తూ, ప్రధానమంత్రికి ఏం కనిపించిందో తనకు తెలియదని, కానీ రాష్ట్రంలో ప్రభుత్వం పటిష్టంగా ఉందని అన్నారు.