Homeక్రైమ్సికింద్రాబాద్‌లో గంజాయి క‌ల‌క‌లం...! నిందితుల‌ అరెస్టు

సికింద్రాబాద్‌లో గంజాయి క‌ల‌క‌లం…! నిందితుల‌ అరెస్టు

సికింద్రాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: మ‌త్తు ప‌దార్థ‌మైన నిషేదిత గంజాయిని విక్ర‌యిస్తున్న ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా న‌లుగ‌రు గంజాయి వినియోగ‌దారుల‌ను సైతం అరెస్టు చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి 11.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 4.38ల‌క్ష‌లు ఉంటుంద‌ని తెలిపారు.

సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్‌ చిలకల గూడపోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితుల‌ను ప‌ట్టుకున్న‌ట్లు తెలిపారు. కాగా ప‌ట్టుబ‌డ్డ నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన సుభాష్ మిషాల్‌,ప‌బిత్ర బీరా,ఆపున్ బిడికిలుగా పేర్కొన్నారు.వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. లభంగా డబ్బులు సంపాదించాలని ఒడిశా నుండి హైదరాబాద్ కు గంజాయిని తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.గంజాయి సరఫరా చేస్తున్న ఒడిశాకు కు చెందిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

తాజావార్తలు