Homeతెలంగాణదాణా బస్తాల భారం.. పాడి రైతు దివాళా

దాణా బస్తాల భారం.. పాడి రైతు దివాళా

•రాష్ట్ర ప్రభుత్వం దాణా బస్తాల ధర తగ్గించాలి..!
•పాడి రైతుల ఆవేదన..!

రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- పాడి పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా మారుతోంది. ముఖ్యంగా ఆవుల డైరీ నిర్వహణను సరైన విధంగా చేస్తే రైతులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే పాడి రైతులకు పెద్ద భారంగా మారుతున్నది దాణా బస్తాల ఖర్చు అని రైతులు చెబుతున్నారు.ఆవులకు ఇచ్చే దాణా బస్తాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాడి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పాలు అమ్మి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం దాణా కొనుగోలుకే ఖర్చవుతుండడంతో రైతులకు ఆశించిన లాభాలు రావడం లేదని పలువురు పాడి రైతులు పేర్కొంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం దాణా బస్తాల ఖర్చులు తగ్గించేలా చర్యలు తీసుకుంటే పాడి రైతులు ఆర్థికంగా బలపడతారని, పాడి రైతు నిజంగా ధనవంతుడు అయ్యే అవకాశం ఉందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాగే రైతులు తమ పొలాల్లోనే పచ్చి మేత పంటలు పండిస్తే దాణా ఖర్చు కొంతవరకు తగ్గుతుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. నాపియర్ గడ్డి, జొన్న మేత వంటి పంటలు పెంచడం ద్వారా ఆవులకు అవసరమైన మేత లభించి ఖర్చులు తగ్గుతాయి.పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి దాణా ధరలను నియంత్రిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతుల ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుందని రైతులు కోరుతున్నారు.

తమిళనాడులో ఎన్డీఏలోకి విజయ్ పార్టీ!.. ఫలించిన పవన్ దౌత్యం

సికింద్రాబాద్‌లో గంజాయి క‌ల‌క‌లం…! నిందితుల‌ అరెస్టు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు