Homeజాతీయంబ్రేకింగ్ న్యూస్ : సీఎం విడాకుల కేసు వాయిదా!

బ్రేకింగ్ న్యూస్ : సీఎం విడాకుల కేసు వాయిదా!

క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు విచారణను చెంగల్పట్టు మహిళా కోర్టు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు విడాకుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, ఈ విడాకుల వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. విజయ్ తల్లి చొరవతో విజయ్, సంగీత మళ్లీ కలుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్, తన వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉండాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కుటుంబ సమేతంగా ఆయన ఆనందంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఖరీదైన ప్రొటీన్ పౌడర్లకు గుడ్‌బై.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

ఫేవరెట్ హీరోపై మనసు విప్పిన రుక్మిణి వసంత్..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు