Homeఆంధ్ర ప్రదేశ్డాక్టర్ల ప్రాక్టీస్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పై క్లారిటీ!

డాక్టర్ల ప్రాక్టీస్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పై క్లారిటీ!

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య వృత్తిని చేపట్టాలనుకునే డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. డాక్టర్ల ప్రాక్టీస్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.తాజా నిబంధనల ప్రకారం, గుర్తింపు పొందిన వైద్య విద్య అర్హత ఉండి, దేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం (UT) మెడికల్ కౌన్సిల్‌లోనైనా రిజిస్ట్రేషన్ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే.. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో నిశ్చింతగా ప్రాక్టీస్ చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న ఎంబీబీఎస్ (MBBS) పట్టభద్రులు, ఏపీలో వైద్య వృత్తిని ప్రారంభించాలంటే, వారు చదివిన రాష్ట్రాల నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NoC) తప్పనిసరిగా సమర్పించాల్సి వచ్చేది. కానీ తాజా నిర్ణయంతో ఇకపై ఆ అవసరం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల వైద్య విద్యార్థులు, యువ డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల డాక్టర్లు సులభంగా ఏపీలో తమ సేవలు అందించడానికి మార్గం సుగమమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో ప్రమాదం.. కిందపడిన ఉక్కు ద్రావణం.!

బ్రేకింగ్ న్యూస్.. ఫ్యాన్స్ ఓకే అంటేనే రాజకీయాల్లోకి ఎంట్రీ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు