Homeతెలంగాణప్ర‌జ‌ల తిరుగుబాటుకు సంకేతం...దొడ్డి కొముర‌య్య‌...! కేసీఆర్

ప్ర‌జ‌ల తిరుగుబాటుకు సంకేతం…దొడ్డి కొముర‌య్య‌…! కేసీఆర్

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: ప్ర‌జా వ్యతిరేక పాల‌న మీద తెలంగాణ ప్ర‌జ‌ల తిరుగుబాటుకు సంకేతంగా నిలిచిన దొడ్డి కొముర‌య్య అమ‌ర‌త్వం, నాటి రాచ‌రిక పాల‌కుల నుంచి నేటి ప్ర‌జా వ్య‌తిరేక పాల‌కుల మీద సాగుతున్న ప్ర‌జా పోరాటాల‌కు స్పూర్తిగా నిలిచింద‌ని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమ‌రుడు దొడ్డి కొముర‌య్య జ‌యంతి సంద‌ర్భంగా బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఘ‌న నివాళులు ఆర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.. సామాజిక సమానత్వం, రాజకీయ హక్కుల కోసం తెలంగాణ సబ్బండ కులాల పోరాటాన్ని పాలక ప్రభుత్వాలు గుర్తించి, రాజ్యాంగ పరమైన హక్కులను అందించగలిగిన నాడే, దొడ్డి కొమరయ్య వంటి ఎందరో తెలంగాణ అమరులు, త్యాగధనులకు నిజమైన ఘన నివాళి అర్పించినట్లవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

తాజావార్తలు