-
ఓటీటీలో రొమాంటిక్ సైకో థ్రిల్లర్ సెన్సేషన్..
-
మూడు ప్లాట్‌ఫాంల్లో ట్రెండింగ్…!
Crime Mirror, Cinema Updates: ఒకప్పుడు థియేటర్లలో హిట్ అయిన సినిమాలే ఓటీటీలో కూడా సత్తా చాటేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందని కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం అద్భుతమైన స్పందన అందుకుంటున్నాయి.
అలాంటి జాబితాలో తాజాగా చేరిన చిత్రం అగ్లీ స్టోరీ. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఏకంగా మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Also Read: గంగన్నగూడ హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే…!
యంగ్ హీరో నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ మే 22న థియేటర్లలో విడుదలైంది. సినిమా కథ, నటీనటుల నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మిశ్రమ స్పందననే అందుకుంది. దీంతో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫాంలలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో నందు సైకో ప్రేమికుడి పాత్రలో కనిపించగా, అవికా గోర్ అమాయక యువతి పాత్రలో నటించింది. అలాగే రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు ప్రణవ్ స్వరూప్ ఈ చిత్రాన్ని సస్పెన్స్, ఎమోషన్స్, రొమాన్స్ మేళవింపుతో తెరకెక్కించారు.
Also Read: పల్నాడు పడవ విషాదం….రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా…!
కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన నేహా (అవికా గోర్)ను ఆమె మామయ్య పెంచుతాడు. అయితే వరుసకు బావ అయిన కార్తీక్ (నందు) చిన్ననాటి నుంచే నేహాపై ప్రేమ పెంచుకుంటాడు. కానీ నేహా మాత్రం గౌతమ్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ ఆ ప్రేమను అంగీకరించలేక ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటాడు.
నేహా జీవితంలో జరిగిన అనుకోని పరిణామాలు, ప్రేమ-అనురాగాల మధ్య దాగి ఉన్న మానసిక సంఘర్షణలు, సైకో ప్రేమికుడి ఆలోచనలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. చివరకు నేహా, కార్తీక్ రక్తపు మడుగులో ఎందుకు కనిపించారు? గౌతమ్‌కు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సస్పెన్స్, రొమాన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలు ఇష్టపడే ప్రేక్షకులకు అగ్లీ స్టోరీ మంచి ఓటీటీ ఛాయిస్‌గా నిలుస్తోంది. అందుకే ఇప్పుడు మూడు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఒకేసారి ట్రెండింగ్‌లో కొనసాగుతూ డిజిటల్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Also Read: కనులవిందుగా పులుల సందడి: అమ్రాబాద్ అటవుల్లో పెరుగుతున్న పెద్ద పులుల సంఖ్య
Also Read: చిన్న తప్పుకు ఉద్యోగం తీసేస్తారా? ఇకపై కఠిన నిర్ణయాలకు బ్రేక్!