Homeక్రైమ్విషాదం...చెత్త ట్రాక్ట‌ర్ ఢికొని ఇద్ద‌రు ఆటో డ్రైవ‌ర్లు మృతి...! ఒక‌రికి గాయాలు

విషాదం…చెత్త ట్రాక్ట‌ర్ ఢికొని ఇద్ద‌రు ఆటో డ్రైవ‌ర్లు మృతి…! ఒక‌రికి గాయాలు

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: జీహెచ్ఎంసీ చెత్త టిప్ప‌ర్ ఢీకొన్న సంఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ఆటో డ్రైవ‌ర్లు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందినఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని మీర్‌పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో విషాదం నెల‌కొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంద మల్లమ్మ చౌరస్తాలోని చంద్రా గార్డెన్స్ వద్ద సంతోష్ (26) అనే ఆటో డ్రైవర్ ఆటో రిపేర్ వచ్చి ఆగిపోయింది. దీంతో తన ఆటోను మెకానిక్ షాపునకు తీసుకెళ్లేందుకు సాయం కావాలని తన స్నేహితులు ప్రసాద్, సునీల్ (33)లకు ఫోన్ చేశాడు.

Also Read:Divorce Cancelled: విడాకుల కోసం వెళ్లిన దంపతులు కోర్టులోనే ఒక్కటయ్యారు.. జడ్జి ముందే హ్యాపీ ఎండింగ్!

వారు మరో ఆటోలో అక్కడకు వచ్చారు. సంతోష్ ఆటోను తమ ఆటోకు తాడుతో కట్టి తరలించేందుకు సునీల్, ప్రసాద్ సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఎల్బీనగర్ వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన జీహెచ్‌ఎంసీ చెత్త టిప్పర్.. రోడ్డు పక్కన ఆగివున్న ఆటోడ్రైవర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ అక్కడిక్కడే మరణించాడు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సునీల్ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read:US- Iran Deal: యుద్ధానికి ముగింపు.. ఇరాన్‌ తో డీల్ కుదిరిందన్న ట్రంప్!

తాజావార్తలు