Homeతెలంగాణపురపాలకలో కొలువుదీరిన కొత్త పాలక వర్గం

పురపాలకలో కొలువుదీరిన కొత్త పాలక వర్గం

•నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా కొణతం చిన్న వెంకటరెడ్డి

•మున్సిపల్ వైస్ చైర్మన్ గా నూకల సందీప్ కుమార్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, నేరేడుచర్ల:- నేరేడుచర్ల మున్సిపల్ లో సోమవారం కొత్త పాలక వర్గం కొలువుదీరింది. మున్సిపల్ చైర్మన్ గా 15వ వార్డు నుంచి గెలిచిన కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చెర్మెన్ గా 6వ వార్డు నుంచి గెలుపొందిన నూకల సందీప్ కుమార్ రెడ్డి లతో పాటు మరో 13మంది కౌన్సిలర్లు తమను నమ్ముకొని ఓటువేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుపరిపాలన అందియనున్నట్లు శాసనం పై ప్రమాణం చేస్తూ తమ తమ పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా ఎంపీ రఘువీర్ రెడ్డి హాజరై నూతనంగా ఎన్నికైన నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పి సీఈఓ శిరీష, మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, ఎన్నికల అధికారి సందీప్, మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి, ఎస్ఐ రవీందర్ తో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Sabarimala Case: శబరిమలలో మహిళలకు ప్రవేశం కేసు.. విచారణకు 9 మందితో సుప్రీం ధర్మాసనం!

Vande Bharat Upadate: కేంద్రం కీలక నిర్ణయం, ఇక వందే భారత్‌ స్లీపర్‌, అమృత్ భారత్ రైళ్లల్లోనూ ఎమర్జెన్సీ కోటా!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు