Homeతెలంగాణఅంగరంగ వైభవంగా బ్రిలియంట్ స్కూల్ వార్షికోత్సవం

అంగరంగ వైభవంగా బ్రిలియంట్ స్కూల్ వార్షికోత్సవం

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బ్రిలియంట్ స్కూల్ వార్షికోత్సవం కనులు పండుగగా అంగరంగ వైభవంగా పిఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. విద్యార్థులు వివిధ రకాల ప్రదర్శనలు ఇచ్చారు.విద్యార్థుల తల్లితండ్రులు అధిక సంఖ్యలో హాజరైనారు.పాఠశాల ప్రిన్సిపల్ ప్రతికంఠం పావని కోటేశ్వరి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ న్యాయవాది మహమ్మద్ అబ్దుల్ రహిం,యంఇఓ కొత్త మహాదేవ రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలో యాజమాన్యం ఉత్తమ పాఠశాలను నడుపుతున్నారని అభినందించారు.విద్యార్థులకు ధృవపత్రాలను బహుమతులు అందచేసారు.పాఠశాల చైర్మన్ ప్రతికంఠం పూర్ణచందర్ రాజు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చక్కనైన విద్య నందిస్తున్నామని విద్యార్థులు తల్లిదండ్రులు సహకరిస్తున్నారని అభినందించారు.ఉదయం 11-00 గం.లకు ప్రారంభమైన ఉత్సవం 6-00 గం.ల వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపీ పి.హేమలత రాజు, కరస్పాండెంట్ శంతన్ రాజు,మాజీ ఎంపిటిసీ యాస కవిత ఇంద్రారెడ్డి,మొదుగుకుంట సర్పంచ్ సోలిపురం ఎల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపిపీ కాలె మల్లేశ్, నేతాజీ యువజన మండలి అధ్యక్షులు దొంతరబోయిన మురళీకృష్ణ, రుక్మిణి,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఎప్పటి వరకు అంటే?

M Modi Rare Honour: ప్రధాని మోడీకి అరుదైన గౌరవం, అత్యున్నత పురస్కారం అందించిన ఇజ్రాయెల్ పార్లమెంట్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు