Homeఅంతర్జాతీయంM Modi Rare Honour: ప్రధాని మోడీకి అరుదైన గౌరవం, అత్యున్నత పురస్కారం అందించిన...

M Modi Rare Honour: ప్రధాని మోడీకి అరుదైన గౌరవం, అత్యున్నత పురస్కారం అందించిన ఇజ్రాయెల్ పార్లమెంట్!

  • ప్రధాని మోడీకి ఇజ్రాయెల్‌ పార్లమెంటు అత్యున్నత పురస్కారం
  • ‘స్పీకర్‌ ఆఫ్‌ ద కెనెసెట్‌ మెడల్‌’ను బహూకరించిన ఇజ్రాయెల్ పార్లమెంట్ స్పీకర్
  • భారత్‌-ఇజ్రాయెల్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేసినందుకు గుర్తుగా పురస్కారం
  • ఈ అవార్డు అందుకున్న తొలి ప్రపంచ నేతగా మోడీ గుర్తింపు!

ప్రధాని నరేంద్ర మోడీకి ఇజ్రాయెల్‌ పార్లమెంటు అత్యున్నత ‘స్పీకర్‌ ఆఫ్‌ ద కెనెసెట్‌ మెడల్‌’ను బహూకరించింది. భారత్‌-ఇజ్రాయెల్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు అసాధారణ రీతిలో కృషి చేసినందుకు దీనిని అందజేసింది. ఇజ్రాయెల్‌ పార్లమెంటు అయిన కెనెసెట్‌లో మోడీ ప్రసంగం పూర్తి కాగానే స్పీకర్‌ అమిర్‌ ఒహానా ఈ పురస్కారాన్ని బహూకరించారు.

ఈ అవార్డు అందుకున్న తొలి నేతగా మోడీ

‘స్పీకర్‌ ఆఫ్‌ ద కెనెసెట్‌ మెడల్‌’ను అందుకున్న తొలి నేత మోడీయే కావడం గమనార్హం. ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా నుంచి కూడా అత్యున్నత పతకాలు అందుకున్న అరుదైన ప్రపంచనేత ఆయనే కావడం మరో విశేషం. ఆయన 2018లో పాలస్తీనా నుంచి ‘గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ద స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీనా’ పురస్కారాన్ని స్వీకరించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు