Homeక్రీడలుఐపీఎల్ చరిత్రనే తిరగరాస్తాడు.. ఈ సారి రూ.40 కోట్లు పక్కా

ఐపీఎల్ చరిత్రనే తిరగరాస్తాడు.. ఈ సారి రూ.40 కోట్లు పక్కా

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్:- భారత క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. నిన్న యూఏఈ (UAE) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాది కొత్త రికార్డు సృష్టించాడు. ఈ కుర్ర బ్యాటర్ ఆటతీరుపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు.వైభవ్ ప్రతిభను కొనియాడుతూ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో వైభవ్ కనుక ఐపీఎల్ మెగా వేలంలోకి వచ్చినా, లేదా ఏదైనా ఫ్రాంచైజీ అతడిని రిటైన్ చేసుకోవాలన్నా ఏకంగా రూ. 40 కోట్ల భారీ ధర పలికే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక రికార్డు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

యువతకు 66 శాతం సీట్లు.. ఉగాది నుంచి పాదయాత్రకు సిద్ధం: విజయసాయిరెడ్డి

వైభవ్ ఆటతీరు గురించి విశ్లేషిస్తూ, “తనదైన రోజున ఏ మ్యాచ్ స్వరూపాన్నైనా ఒంటిచేత్తో మార్చేయగల అద్భుతమైన సత్తా వైభవ్ సొంతం. ప్రస్తుత క్రికెట్‌లో అంతటి విధ్వంసకర సామర్థ్యం మరెవరికీ లేదని నా అభిప్రాయం. అతడి బ్యాటింగ్ శైలి ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది” అని చోప్రా ప్రశంసించారు.
అంతేకాకుండా, “చరిత్రను మార్చడం లేదా కొత్త చరిత్రను సృష్టించడం అనే పదాలు ఇకపై వైభవ్ సూర్యవంశీ పేరుతోనే ముడిపడి ఉంటాయి” అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించారు. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి పరిణతి, పవర్ హిట్టింగ్ సామర్థ్యం కలిగి ఉండటం భారత క్రికెట్‌కు శుభపరిణామమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో వైభవ్ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు: హీరో నిఖిల్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు