Homeతెలంగాణవిశ్వ‌సుంద‌రిగా జెన్నిఫ‌ర్ బారెటో...!

విశ్వ‌సుంద‌రిగా జెన్నిఫ‌ర్ బారెటో…!

శాన్‌జువాన్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ప్యూర్టో రికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో ఏడేళ్ల కుమార్తెకు త‌ల్లిగా అంత‌ర్జాతీయ పోటిల్లో పాల్గొని విజేత‌గా నిలిచి చ‌రిత్ర సృష్టించారు. 75వ మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్‌ బారెటో విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది విజేత, మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్‌.. జెన్నిఫర్‌కు కిరీటాన్ని అలంకరించారు. ప్యూర్టోరికో రాజధాని శాన్‌జువాన్‌లో జరిగిన ఈ పోటీల్లో 116 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్‌ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత్‌ తరఫున బరిలోకి దిగిన కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్‌ మెజో టాప్‌-30లో చోటు దక్కించుకున్నారు. అయితే, టాప్‌-12లోకి చేరలేకపోయారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు: ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు!
  2. ప్రపంచం AI వైపు పరుగులు తీస్తుంటే ఇంకా కులమత రాజకీయాలేనా? సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే
  3. ఐపీఎల్ 2027 వేలానికి రంగం సిద్ధం.. బరిలో సెహ్వాగ్ తనయుడు!
  4.  తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న రక్తహీనత: మహిళలు, చిన్నారుల్లో పెరుగుతున్న ముప్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు